Sai Dharam Tej, Rashi Khanna & Maruthi’s ‘Prati Roju Pandaage’ Movie Launched

Sai Dharam Tej, Rashi Khanna & Maruthi’s ‘Prati Roju Pandaage’ Movie Launched (Photo:SocialNews.XYZ)

Supreme Hero Sai Dharam Tej had scored the desired hit this year in the form of Chitralahari in the direction of Kishore Tirumala. Despite a couple of offers from the noted director and top production houses, the mega hero took his own time to sign for his next project. It was speculated that Sai Dharam Tej is going to team up with director Maruthi and Geetha Arts banner is going to produce the project.

Making the news true, today Sai Dharam Tej’s new film in the direction of Maruthi got launched and the makers have even announced the title of the movie. Sai Dharam Tej new film has got a proper Telugu title as “Prati Roju Pandaage” and #SDT12 is being planned for Makara Sankranti 2020 release.

Repeating the successful hit combination heroine Raashi Khanna is signed to play the female lead opposite Sai Dharam Tej in Prati Roju Pandaage. Sensational music director S.S.Thaman is going to score music for this project and Nizar Shafi is the cinematographer.

Along with Geetha Arts banner, Prati Roju Pandaage is also been produced by UV Creations banner. Rest of the cast and crew details will be announced very soon. All the best to the entire team of Prati Roju Pandaage and to the mega hero Sai Dharam Tej to continue his success streak in the direction of Maruthi Dasari.

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, సాయి తేజ్ హీరోగా, మారుతి దర్శకత్వంలో, బన్ని వాస్ నిర్మాతగా "ప్రతిరోజు పండగే" ఘనంగా ప్రారంభం

ఇటీవలే చిత్రలహరి చిత్రంతో మంచి విజయం అందుకొన్న సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా.... భలే భలే మగాడివోయ్, మహానుభావుడు వంటి బంపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన మారుతి దర్శకుడిగా, ఎన్నో ఇండస్ట్రీ హిట్ చిత్రాల్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, వంద కోట్ల క్లబ్ లో చేరిన గీత గోవందం వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన బన్నీ వాస్ నిర్మాతగా "ప్రతిరోజు పండగే" చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్ లోని ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ఘనంగా జరిగింది. GA2UV పిక్చర్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని గ్రాండియర్ గా నిర్మించనున్నారు.

సాయి తేజ్ - మారుతి కాంబినేష‌న్
ఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్స్ తెర‌కెక్కించ‌డంలో ద‌ర్శ‌కులు మారుతి త‌న‌కంటూ ఓ ముద్ర వేసుకున్నారు. ఇంత‌వ‌ర‌కు మార‌తి డైరెక్ష‌న్ లో వ‌చ్చిన భ‌లే భ‌లే మ‌గాడివోయ్, మ‌హానుభావుడు వంటి చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్స్ హిట్స్ గా నిలిచాయి. ఇక తాజాగా వ‌చ్చిన చిత్రల‌హ‌రి సినిమాతో హీరో సాయితేజ కూడా హిట్ అందుక‌ని అటు మాస్ ఆడియెన్స్ ని ఇటు క్లాస్ ఆడియెన్స్ ని విశేషంగా ఆక‌ట్టుకున్నారు. ఈ నేప‌థ్యంలో సాయితేజ‌, మారుతి కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌నున్న ప్ర‌తి రోజు పండుగే పై భారీగా అంచనాలు ఏర్ప‌డుతున్నాయి.

GA2 - UV పిక్చర్స్ కాంబినేష‌న్
టాలీవుడ్ లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు జీఏ 2, యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా జీఏ2యూవీ పిక్చ‌ర్స్ సంస్థ‌గా ఏర్ప‌డి క్రేజీ కాంబినేష‌న్స్ తో, ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునే రీతిన సినిమాల‌ను నిర్మిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత శ్రీ అల్లు అర‌వింద్ గారి నిర్మాణ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో, నిర్మాత‌లు బ‌న్నీవాస్, వంశీ, ప్ర‌మోద్, విక్కీలు సార‌ధ్యంలో ఇప్ప‌టికే ఈ బ్యాన‌ర్ నుంచి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ వ‌చ్చాయి. గ‌తంలో ఈ బ్యాన‌ర్ నుంచి మారుతి డైరెక్ష‌న్ లో వ‌చ్చిన భ‌లే భ‌లే మ‌గాడివోయ్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన సంగ‌తి తేలిసిందే. ఇదే రీతిన మంచి విజ‌యం అందుకునే దిశ‌గా సాయితేజ్ హీరోగా మారుతి డైరెక్ష‌న్ లో ప్ర‌తి రోజు పండుగే తెర‌కెక్కుతుంది.

సుప్రీమ్ హీరో సాయితేజ్ - ఢిల్లీ బ్యూటీ రాశీ ఖ‌న్నా కాంబినేష‌న్
సుప్రీమ్ హీరో సాయి తేజ్, ఢిల్లీ బ్యూటీ రాశీ ఖ‌న్నా క‌లిసి న‌టిస్తున్నార‌నే ఎనౌన్స్ మెంట్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి వీరి పెయిర్ కి మంచి క్రేజ్ ఏర్ప‌డింది. సోష‌ల్ మీడియాలో సైతం ఈ జోడి పై పాజిటివ్ కామెంట్స్ వ‌చ్చాయి. గ‌తంలో వీరిద్ద‌రు క‌లిసి న‌టించిన సుప్రీమ్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ టాక్ తెచ్చ‌కున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌తి రోజు పండుగే చిత్రంలో కూడా వీరిద్ద‌రి కాంబినేష‌న్, పాత్ర‌ల‌పై ఆస‌క్తి నెల‌కొంది.

ఆక‌ట్టుకోనున్న స‌త్య‌రాజ్ - రావుర‌మేశ్ పాత్ర‌లు
క‌ట్ట‌ప్ప‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కి మరింత చేరువైన ప్ర‌ముఖ న‌టులు స‌త్య‌రాజ్ క్యారెక్ట‌ర్ ని ఈ సినిమా ద‌ర్శ‌కులు మారుతి ప్ర‌త్యేకంగా డిజైన్ చేస్తున్నారు. అలానే ఈ సినిమాలో న‌టిస్తున్న మ‌రో న‌టుడు రావు ర‌మేశ్ పాత్ర కూడా హైలెట్ గా ఉండ‌నుంది.

నటీనటులు
సాయి తేజ్, రాశి ఖన్నా, సత్యరాజ్, విజయ కుమార్, రావ్ రమేష్, మురళీ శర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, సత్య శ్రీనివాస్, సుభాష్, భరత్ రెడ్డి, గాయత్రీ భార్గవి, హరితేజ, మహేష్, సుహాస్ తదితరులు

సాంకేతిక వర్గం
రచన, దర్శకత్వం - మారుతి దాసరి
సమర్పణ - అల్లు అరవింద్
ప్రొడ్యూసర్ - బన్నీ వాస్
కో ప్రొడ్యూసర్ - ఎస్.కె.ఎన్
మ్యూజిక్ డైరెక్టర్ - తమన్ .ఎస్
ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వర రావ్ (చంటి)
ఆర్ట్ డైరెక్టర్ - రవీందర్
ఎగ్జీక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ - బాబు
డిఓపి - జైకుమార్ సంపత్
పీఆర్ఓ - ఏలూరు శ్రీను
పబ్లిసిటీ డిజైనర్ - అనిల్ భాను

Facebook Comments

About Gopi

Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.

He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.

When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.

He can be reached at gopi@socialnews.xyz

Share

This website uses cookies.

%%footer%%