దొరసాని ‘కళ్లల్లో కలవరమై’ సాంగ్ లాంచ్
ఆనంద్ దేవరకొండ, శివాత్మక లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్ టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాలు సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ ‘దొరసాని’.. జులై 12న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈమూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ శివాత్మక. ఈ మూవీ లోనుండి సింగర్ చిన్మయి పాడిన పాట ‘కళ్లల్లో కలవరమై’సాంగ్ ని రెడియో మిర్చిలో లాంచ్ చేసారు. ఇప్పటికే రిలీజ్ అయిన ‘ నింగిలోన పాలపుంత నవ్వులొంపెనే’ పాట కు మంచి రెస్పాన్స్ వస్తుంది.
ఈ సందర్భంగా ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ: ‘ ఒక స్వచ్ఛమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. దొరసాని లో పాటలు కథలో భాగంగా ఉంటాయి. ఇప్పటికే ‘ నింగిలోనపాలపుంత’ పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రశాంత్ ఆర్ విహారి అందించిన ట్యూన్స్ చాలా బాగున్నాయి. ‘కళ్లల్లో కలవరమై’ పాట కూడా మీకు నచ్చుతుందని నమ్ముతున్నాను’ అన్నారు.
హీరోయిన్ శివాత్మిక మాట్లాడుతూ: ‘కళ్ళల్లో కలవరమై’ పాట చాలా బాగా పిక్చరైజ్ చేసారు దర్శకుడు మహేంద్రగారు. ఈ పాట ప్రేమకథలోని ఎమోషన్స్ ని చూపెడుతుంది. ఈ సినిమాలో నా లుక్ కి చాలా ప్రశంసలు వస్తున్నాయి. దొరసాని వంటి సినిమాతో ఇంట్రడ్యూస్ అవడం చాలా ఆనందంగా ఉంది. ’ అన్నారు.
ఆనంద్ దేవరకొండ, శివాత్మిక హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతోన్న ఈ చిత్రంలో కన్నడ కిశోర్, వినయ్ వర్మ, ‘ఫిదా’ శరణ్య ఇతర ప్రధాన పాత్రల్లో
నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు సమర్పణలో వస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : సన్నీ కూరపాటి ఎడిటర్ : నవీన్ నూలి సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి ఆర్ట్ డైరెక్టర్ : జెకె మూర్తి పి.ఆర్.వో : జి.ఎస్.కె మీడియా కో ప్రొడ్యూసర్ : ధీరజ్ మొగిలినేని నిర్మాతలు : మధుర శ్రీధర్ రెడ్డి, యశ్ రంగినేని రచన, దర్శకత్వం : కె.వి.ఆర్. మహేంద్ర.