Social News XYZ     

Jai Sena movie teaser released by Gopichand

సముద్ర 'జై సేన' టీజర్ ను రిలీజ్ చేసిన ఎగ్రెసివ్ హీరో గోపీచంద్

Jai Sena movie teaser released by Gopichand

Jai Sena movie teaser released by Gopichand (Photo:SocialNews.XYZ)

శ్రీకాంత్‌, సునీల్‌, శ్రీ, పృథ్వీ, ప్రవీణ్‌, కార్తికేయ ప్రధాన తారాగణంగా వి.విజయలక్ష్మి సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్‌ పతాకంపై వి.సముద్ర దర్శకత్వంలో వి.సాయి అరుణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న చిత్రం 'జై సేన'. ఇటీవల విడుదలైన ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌, మోషన్‌ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అలాగే ఈ చిత్రం టీజర్‌ను ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ రిలీజ్‌ చేశారు.

 

ఈ సందర్భంగా ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ మాట్లాడుతూ - ''సముద్రగారి డైరెక్షన్‌లో రూపొందుతున్న 'జైసేన' టీజర్‌ను రిలీజ్‌ చేశాం. టీజర్‌ చాలా బాగుంది. ఈ సినిమాలో సునీల్‌గారు ఒక స్పెషల్‌ రోల్‌ చేశారు. ఆయన ఉన్న టీజర్‌నే ఈరోజు రిలీజ్‌ చేశాం. ఇందులో శ్రీకాంత్‌గారితోపాటు కొంతమంది కొత్త కుర్రాళ్ళు కూడా చేశారు. ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధించాలని, సముద్రగారు ఇంకా మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అన్నారు.

కో-ప్రొడ్యూసర్‌ పి.శిరీష్‌రెడ్డి మాట్లాడుతూ - ''ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్యాచ్‌వర్క్‌ జరుగుతోంది. నాలుగు రోజుల్లో పూర్తవుతుంది. త్వరలోనే రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.

దర్శకుడు సముద్ర మాట్లాడుతూ ''గోపీచంద్‌ చేతులమీదుగా మా సినిమా టీజర్‌ విడుదల కావడం చాలా ఆనందంగా ఉంది. ఇందులో శ్రీకాంత్‌, సునీల్‌ క్యారెక్టర్స్‌ చాలా హైలైట్‌గా ఉంటాయి. వీరితోపాటు నలుగురు యువ హీరోలు ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నారు. వారి క్యారెక్టర్స్‌కి కూడా చాలా ఇంపార్టెన్స్‌ ఉంటుంది'' అన్నారు.

శ్రీకాంత్‌, సునీల్‌, శ్రీ, పృథ్వి, ప్రవీణ్‌, కార్తికేయ, అభిరామ్‌, హరీష్‌ గౌతమ్‌, అజయ్‌ ఘోష్‌, మధు, ఆజాద్‌, ధనరాజ్‌, వేణు, చమ్మక్‌ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: తిరుమల శెట్టి సుమన్‌, పార్వతిచందు, పాటలు: అభినయ్‌ శ్రీను, సిరాశ్రీ, సంగీతం: రవిశంకర్‌, డ్యాన్స్‌: అమ్మారాజశేఖర్‌, అజయ్‌, ఫైట్స్‌: కనల్‌ కన్నన్‌, నందు, రవివర్మ, కెమెరా: వాసు, కో ప్రొడ్యూసర్స్‌: పి.శిరీష్‌ రెడ్డి, దేవినేని శ్రీనివాస్‌, నిర్మాత: వి.సాయి అరుణ్‌ కుమార్‌, కథ, స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: వి.సముద్ర.

Facebook Comments