జులై 12న ‘దొరసాని’ విడుదల
పరిశ్రమలోనూ, ప్రేక్షకుల్లోనూ ఆసక్తిని రేకెత్తించిన ‘దొరసాని’ జులై 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్ టైన్మెంట్ , బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తిచేసుకొని గ్రాండ్ రిలీజ్ కి సిద్దం అవుతుంది. ఈ చిత్రంతో దర్శకుడిగా కె.వి.ఆర్ మహేంద్ర పరిచయం అవుతున్నాడు.
80వ దశకంలో తెలంగాణా ప్రాంతంలో జరిగిన ఒక స్వచ్ఛమైన ప్రేమకథ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది చిత్ర యూనిట్.
ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ‘నింగిలోన పాలపుంత నవ్వులొంపెనే’ పాట దొరసాని పై అంచనాలను పెంచాయి. మరోపాట ‘కలవరమై.. కలవరమై’ఈనెల 24న రిలీజ్ అవుతుంది.
కల్మషం లేని ప్రేమకథగా తెరకెక్కిన ‘దొరసాని ’ప్రేమకథలలో ప్రత్యేకస్థానంలో నిలుస్తుందంటున్నారు దర్శక నిర్మాతలు.
ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతోన్న ఈ చిత్రంలో కన్నడ కిశోర్, వినయ్ వర్మ, ‘ఫిదా’ శరణ్య ఇతర ప్రధాన పాత్రల్లో
నటిస్తున్నారు.
డి.సురేష్ బాబు సమర్పణలో వస్తోన్న ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ : సన్నీ కూరపాటి
ఎడిటర్ : నవీన్ నూలి
సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి
ఆర్ట్ డైరెక్టర్ : జె.కె మూర్తి
పి.ఆర్.వో : జి.ఎస్.కె మీడియా
కో ప్రొడ్యూసర్ : ధీరజ్ మొగిలినేని
నిర్మాతలు : మధుర శ్రీధర్ రెడ్డి, యశ్ రంగినేని
రచన, దర్శకత్వం : కె.వి.ఆర్. మహేంద్ర
This website uses cookies.