Palasa 1978 movie first look launched

‘‘ప‌లాస 1978’’ ఫ‌స్ట్ లుక్ లాంచ్

Palasa 1978 movie first look launched (Photo:SocialNews.XYZ)

ఉత్తారాంధ్ర‌లోని ప‌లాస ప్రాంత ఆత్మ‌ను తెర‌మీద‌కు తీసుకొచ్చే ప్ర‌య‌త్నం ‘‘ప‌లాస 1978’’ చిత్ర యూనిట్ చేసింది. తెలుగుసినిమా క‌థ‌లు కొన్నిచ‌ట్రాల్లో బిగుసుపోయిన టైం లో కంచెర‌పాలం ఆ గిరిని దాటుకొని కొత్త అనుభూతుల‌ను ప్రేక్ష‌కుల‌కు పంచింది. ఆ కోవ‌లో ప‌లాస చిత్రం కూడా ఒక నిజ‌మైన ఎమోష‌న్స్  చుట్టూ , స‌మాజంలో పేరుకుపోయిన అస‌మాన‌త‌లుకు వెండితెర రూపంగా రూపొందింది. గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్,సుబ్రహ్మణ్యపురం తరహాలో రియలిస్టిక్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ లుక్ ను హీరో ర‌క్షిత్ బ‌ర్త్డే సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు మారుతి ,చిత్ర సమర్పకులు త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ లాంచ్ చేసారు.

ఈ సంద‌ర్భంగా మారుతి గారు మాట్లాడుతూః
నిర్మాత ప్ర‌సాద్ గారు క‌థ చెప్పిన‌ప్పుడు మాములు క‌థ అనుకున్నాను. కానీ ఇప్పుడు సినిమా గురించి తెలిసాక ఈ క‌థ‌ను ఆ ఊరిలో ఉండి , తిరిగి, అనుభ‌వించి  రాసారు. మంచి ఇంటెన్ష‌న‌ల్ క‌థ‌ను తీసుకున్నారు. కంచెర‌పాలెం లాగా ఇది ప్రేక్ష‌కుల‌కు కొత్త అనుభూతిని ఇస్తుంద‌ని న‌మ్ముతున్నాను. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ బాగుంది. చాలా కొత్త గా డిజైన్ చేసారు. వాట‌ర్ పెయిటింగ్ తో చాలా అందంగా డిజైన్ చేసారు. హీరో లుక్ బాగుంది. మంచి ఎక్స్ పీరియ‌న్స‌డ్ హీరోలాగా క‌న‌ప‌డుతున్నాడు. త‌మ్మారెడ్డి గారు ఇలాంటి సినిమాలకు అండ‌గా నిల‌బ‌డ‌టం ఆనందించ‌త‌గ్గ విష‌యం. త‌మ్మారెడ్డి మార్క్ క‌న‌ప‌డుతుంది. ప్ర‌తి నెలా ఇలాంటి మ‌వీస్ ఆయ‌న నుండి రావాలి అని కోరుకుంటున్నాను అన్నారు.

తమ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాట్లాడుతూ:
ఈ క‌థ చెప్ప‌టానికి వ‌చ్చి న‌ప్పుడు చాలా అయిష్టంగానే విన్నాను. కానీ క‌థ విన్నాక ఇందులో విష‌యం గ‌మ్మ‌త్తుగా ఉంది . ముంబైలో మాఫియా ఒక‌లాగా ఉంటుంది, విజ‌య‌వాడ‌లో ఒక‌లాగా ఉంటుంది. అలాగే ప్ర‌తి ఊరిలో ఒక మాఫియా ఉంది. అది ఎలా ఉంటుంది అనే విష‌య‌మే ప‌లాస‌లో కొత్త‌గా ఉంటుంది. ప‌లాస పేరు చాలామందికి తెలియ‌క‌పోవ‌చ్చు కానీ ఈసినిమా ప‌లాస కు ఒక కొత్త గుర్తింపు ను తెస్తుంది. ఇందులో ప‌నిచేసిన ప్ర‌తి వాళ్లు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు.  చెర‌పాలెం లుక్ లోనే కొత్త స‌బ్జెక్ట్ ని చేసారు. ఒక్క‌ప్పుడు ప్ర‌తి ద‌ర్శ‌కుడు ఒక్కో జాన‌ర్ లో సినిమాలు తీసేవాడు, కానీ ఇప్పుడు అంద‌రూ ఒకే జాన‌ర్ లో సినిమాలు తీస్తున్నారు.  ప‌లాస ప్రేక్ష‌కుల‌కు కొత్త ఎక్స్ పీరియ‌న్స్ ల‌ను అందిస్తుంద‌ని న‌మ్ముతున్నాను. అన్నారు.

మ్యూజిక్ ద‌ర్శ‌కుడు రఘు కుంచె మాట్లాడుతూ :
ఆర్టిస్ట్ గా అప్పుడ‌ప్పుడూ క‌నిపిస్తున్నా ఇందులో మాత్రం క్రూరమైన పాత్ర ను చేసాను. సినిమా లో 40 సంవ‌త్స‌రాల జ‌ర్నీ ఉంటుంది అంత జ‌ర్నీ నా పాత్ర‌కు కూడా ఉంటుంది. హీరో ర‌క్షిత్ ఇక‌నుండి త‌న ప్ర‌తి పుట్టిన రోజూ త‌న సినిమా ఈవెంట్ లోనే జ‌రుపుకోవాల‌ని కోరుకుంటున్నాను. కంచెర‌పాలెం, సుబ్ర‌మ‌ణ్య‌పురం త‌ర‌హాలో రెండు గంటలు వరకు పలాస లో ప్రేక్ష‌కుల్ని తిప్పుతుంది. ఫస్ట్ ఆఫ్ చూసాను, మ్యూజిక్ కి టైం కావాలి అని అడిగాను. అంత తొంద‌ర తొంద‌ర‌గా ఈ సినిమాకి మ్యూజిక్ ఇవ్వ‌లేం. సినిమాలో క‌నిపించే అన్ని పాత్రలకు ఎలివేషన్ ఉంది. డ్రామా ఉంది, వోయిలెన్స్ ఉంది. సినిమాటోగ్రఫీ హైలెట్ గా నిలుస్తుంది.

హీరో రక్షిత్ మాట్లాడుతూ :
ఈ సినిమా క‌థ విన‌గానే విప‌రీతంగా న‌చ్చింది అందుకే ద‌ర్శ‌కుడుని పూర్తిగా న‌మ్మాను. రెండు నెల‌ల పాటు ప‌లాస లో షూట్ చేసాం, అక్క‌డ అన్ని సౌక‌ర్యాలు ఉండ‌వు. అయినా టీం అంద‌రూ బాగా స‌హాక‌రించి షూటింగ్ కంప్లీట్ చేసాం. ఎన్ని క‌ష్టాలు ప‌డినా, ఇప్పుడు సినిమా చూసాక మ‌రిచిపోయాం. ఈసినిమాలో నా పాత్ర‌కు నాలుగు వేరియేష‌న్స్ ఉంటాయి. గాంగ్స్ ఆఫ్ వ‌సే పూర్ లాంటి సినిమా తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించ‌బోతున్నాం. త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల ఆద‌రిస్తార‌ని న‌మ్ముతున్నాం అన్నారు.

హీరోయిన్ నక్షత్ర మాట్లాడుతూ:
ఈ మూవీ విష‌యంలో త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ గారికి థ్యాంక్స్ చెప్పాలి. మాకు ఎంతో స‌పోర్ట్ గా నిలిచారు. ద‌ర్శ‌కుడు కుమార్ గారు చెప్పిన విధానం న‌చ్చి ఈసినిమా చెయ్యాల‌ని నిర్ణ‌యించుకున్నాను. ఎన్ని అవాంత‌రాలు వ‌చ్చినా ఆయ‌న అనుకున్న‌ది చేసారు. చాలా స్ట్ర‌గుల్స్ ని ఎదుర్కున్నాం. కానీ ఇప్పుడు సినిమా గురించి ఇంత పాజిటివ్ టాక్ వింటుంటే అవ‌న్నీ మ‌ర్చిపోతున్నాం. హీరో రక్షిత్ బాగా స‌పోర్ట్ చేసారు. కొన్ని స‌న్నివేశాల‌లో నాకు నేనే కొత్త గా అనిపించాను. క్యాస్టూమ్స్ కూడా చాలా రియ‌లిస్టిక్ గా వాడాము. ఇలాంటి ప్రాజెక్ట్ లో పార్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అన్నారు.

ద‌ర్శ‌కుడు కరుణ కుమార్ మాట్లాడుతూ :
తెలుగు లో నేటివ్ కథ లు చాలా త‌క్కువుగా వ‌స్తున్నాయి. తెలుగు క‌థ వైజాగ్ దాటి ముందుకు పోలేదు. ప‌లాస ప్రాతం బ్యాక్ డ్రాప్ లో రాసుకున్న ఈ క‌థ‌ను తీసుకొని ప్రసాద్, తమ్మారెడ్డి లకు చెప్పాను.వాళ్ళ ముందుకు రావ‌డంతోనే ఈక‌థ ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాగ‌లుగుతున్నాను. నేను ఎంత గొప్ప‌గా క‌థ రాసుకున్నా అది ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అవ్వాలంటే ద‌ర్శ‌కుడి ఆలోచ‌న‌ల‌ను అర్దం చేసుకునే కెమెరా మెన్ కావాలి విన్సెంట్ అరుల్ నా క‌థ‌కు ప్రాణం పోసాడు. 40 యేళ్ళ పాటు సాగే క‌థ‌ను 40 రోజుల్లో తీయ‌గ‌లిగాం అంటే అది మా టీం నాకు అందించిన స‌హాకార‌మే. ఫ‌స్ట్ లుక్ విష‌యంలో కూడా కొత్త‌గా ట్రై చేసాం ఇప్పుడు అంద‌రూ లుక్ బాగుంది అంటుంటే చాలా సంతోషంగా ఉంది. అన్నారు.

ర‌చ‌యిత నాగేంద్ర :
తెలుగు సినిమా క‌థ‌లు కొన్ని ప‌రిధుల‌లో ఆగిపోయాయి. ఆ ప‌రిధులుదాటి క‌థ‌ను చెప్పేందుకు ప్ర‌య‌త్నించాం. ప‌లాస ప్రాతం యెక్క ఆత్మ ఈసినిమాలో క‌న‌ప‌డుతుంది. అస‌మాన‌తులు, కులాల మ‌ద్య పోరు వంటి సామాజిక అంశాలు ఇందులో ఉంటాయి. త‌ప్ప‌కుండా ప‌లాస కొత్త అనుభూత‌లను ఇస్తుంది అన్నారు.

కెమెరా మెన్ విన్సెంట్ అరుల్ మాట్లాడుతూ:
కొన్ని సినిమాలే మనసుకు దగ్గరగా వస్తాయి. నాకు ప‌లాస క‌థ విన్న‌ప్పుడు అలాంటి అనుభూతి క‌లిగింది. ద‌ర్శ‌కుడు రాసుకున్న క‌థ‌లో చాలా విష‌యాలు ఆశ్చ‌ర్యం క‌లిగించారు. ఇందులో ప‌నిచేసిన ప్ర‌తి ఒక్క‌రు చాలా బాగా చేసారు. ఈ అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌కుడు కు థ్యాంక్స్ అన్నారు.

న‌టీ న‌టులుః
ర‌క్ష‌త్, న‌క్ష‌త్ర‌, ర‌ఘుకుంచె, తిరువీర్, విజ‌య‌రామ‌రాజు, త‌న్మ‌యిబోలి, ప్ర‌వీణ్, జ‌నార్ధ‌న్, మిర్చి మాధ‌వి త‌దిత‌రులు

టెక్నీషియన్స్:

స‌మ‌ర్ప‌ణః త‌మ్మ‌రెడ్డి భ‌ర‌ద్వాజ‌,
కో ప్రొడ్యూస‌ర్ -ఎ.ఆర్ బెల్ల‌న్న‌,
మ్యూజిక్ - ర‌ఘుకుంచె,
సినిమాటోగ్ర‌ఫీః\అరుల్ విన్సెంట్,
ఎడిటింగ్ ః కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు,
కొరియోగ్ర‌ఫీః విజ‌య్ పొలాకి,
స్టంట్స్ః రామ్ సుంక‌ర‌,
పి.ఆర్.వో- జి.ఎస్.కె మీడియా
నిర్మాతః ధ్యాన్ అట్లూరి,
రచన,ద‌ర్శ‌క‌త్వంః క‌రుణ కుమార్

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%