యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘రాజా నరసింహా’
మమ్ముటీ, జై, మహిమా నంబియర్ కీలక పాత్రధారులుగా మలయాళంలో తెరకెక్కిన ‘మధురరాజా’ చిత్రాన్ని ‘రాజా నరసింహా’ టైటిల్‌తో జై చెన్నకేశవ పిక్చర్స్ పతాకంపై సాధుశేఖర్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ‘మన్యంపులి’తో ఘన విజయం అందుకున్న వైశాక్ దర్శకత్వం వహించిన చిత్రమిది. జగపతిబాబు ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుదలై దాదాపు వంద కోట్లు వసూళ్లు రాబట్టింది. ‘యాత్ర’ వంటి సూపర్‌హిట్ సినిమా మమ్ముటీ హీరోగా తెలుగులో వస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం అనువాద కార్యక్రమాల్లో ఉంది. జూలైలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
నిర్మాత మాట్లాడుతూ.. ‘‘మలయాళంలో భారీ విజయం సాధించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. చక్కని సందేశం కూడా ఉంది. మమ్ముటీ, జై పాత్రలు ఆకట్టుకుంటాయి. ప్రతినాయకుడిగా జగపతిబాబు పాత్ర మరోస్థాయిలో ఉంటుంది. సన్నీలియోన్ నటించిన ప్రత్యేక గీతం యువతను ఉర్రూతలూగిస్తుంది. గోపీ సుందర్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ. త్వరలో అనువాద కార్యక్రమాలు పూర్తి చేసి జూలైలో సినిమాను విడుదల చేస్తాం’’అని అన్నారు.
ఈ చిత్రానికి సహనిర్మాత: నూల అశోక్, నిర్మాణ సారధ్యం: వడ్డీ రామానుజం, పురం రాధాకృష్ణ.
Facebook Comments