Social News XYZ     

Mahadevapuram movie team busy with post-production work

Mahadevapuram movie team busy with post-production work

Mahadevapuram movie team busy with post-production work (Photo:SocialNews.XYZ)

ల‌క్కీ ఆర్ట్స్ ప‌తాకంపై కె. చంద్ర‌శేఖ‌ర్ హీరోగా న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌కత్వంలో నిర్మిస్తోన్న చిత్రం మ‌హదేవ‌పురం. ప్రీతిసింగ్, ప్ర‌మీల‌ హీరోయిన్స్. ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ఈ రోజు రిలీజ్ చేసారు.

ఈ సంద‌ర్భంగా హీరో-ప్రొడ్యూస‌ర్-డైర‌క్ట‌ర్ కె.చంద్ర‌శేఖ‌ర్ మాట్లాడుతూ...మ‌హ‌దేవపురం` అనే ఊరి చివ‌రిలో ఉండే ఒక ఫారెస్ట్ లో వ‌రుస‌గా మ‌ర్డ‌ర్స్ జ‌రుగుతుంటాయి. ఆ మ‌ర్డ‌ర్స్ అక్క‌డే తిరిగే పాము చేస్తుందా? లేదా దెయ్యం చేస్తుందా? అనేది మిస్ట‌రి. ఆ మిస్ట‌రీని హీరో ఎలా ఛేదించాడు ? ఏంట‌న్న‌ది ఇంట్ర‌స్టింగ్ పాయింట్‌. ఇందులో ఆడియ‌న్స్ కు కావాల్సిన అన్ని అంశాలు పొందుప‌రిచాము. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసాం. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. క‌థ‌, క‌థ‌నాల‌తో పాటు సినిమాటోగ్రఫీ, మ‌హేష్ నారాయ‌ణ సంగీతం సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌లుగా నిలుస్తాయి. త్వ‌ర‌లో ఆడియో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.

 

అర్జున్ రాజు, సూర్య‌నారాయ‌ణ‌, బ్ర‌హ్మం, ప్ర‌స‌న్న‌, గంట గురుమూర్తి, డిఎస్ పి, మ‌ణి రాజ్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి ఫైట్స్ఃర‌వి; కెమేరాః గోపి; ఎడిట‌ర్ః మేన‌గ శ్రీను, ఉద‌య్; స‌ంగీతంః మ‌హేష్ నార‌య‌ణ‌; కో-ప్రొడ్యూస‌ర్ః కె.వి. సూర్య‌నారాయ‌ణ‌; ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం-నిర్మాతః కె.చంద్ర‌శేఖ‌ర్.

Facebook Comments