The teaser of Saaho ripped off almost all One-day highest likes and views records on YouTube. Prabhas fans were on the could nine when the teaser hit the YouTube and the way it smashed the records. Graphics were highly appreciated in the teaser along with the Prabhas looks.
However, it is the background music at the end which stole the hearts of fans and movie lovers. Gibran Mahmood who earlier worked for "Ratsasan" , "Viswaroopam-II", "Uttama Villain", "Run Raja Run" and many other crazy super hit projects is composing the background score for this magnum opus.
Saaho director Sujith and Gibran earlier worked together Run Raja Run and they maintain a highly healthy relationship which led to them to work for Saaho.
ప్రెస్టీజియస్ రెబెల్ స్టార్ ప్రభాస్ "సాహో" చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించనున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్
'బాహుబలి' 1, 2 తరువాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠని మరింత పెంచుతూ మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం 'సాహో. ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్ రికార్డ్ స్థాయి వ్యూస్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇదిలావుంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ విషయాన్ని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఈ భారీ చిత్రానికి స్టార్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తుండడం విశేషం. రన్ రాజా రన్, విశ్వరూపం, జిల్ వంటి చిత్రాలతో మ్యూజిక్ లో స్పెషల్ ట్రెండ్ సృష్టించాడు జిబ్రాన్. సాహో చాప్టర్ 2 కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించింది కూడా జిబ్రానే కావడం తెలిసిందే. రన్ రాజా రన్ వంటి సూపర్ హిట్ చిత్రం చేసినప్పుడు దర్శకుడు సుజిత్ తో వర్క్ పరంగా జిబ్రాన్ కు మంచి అనుబంధం ఏర్పడింది. సాహో భారీ ప్రాజెక్ట్ కావడంతో టాలెంటెడ్ జిబ్రాన్ ని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసేందుకు ఎంపిక చేసుకున్నామని చిత్రం దర్శక నిర్మాతలు తెలియజేశారు. ఈ చిత్రం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేకంగా నిలవనుంది. ప్రతీ సీన్ ని ఎలివేట్ చేసే విధంగా వరల్డ్ క్లాస్ క్వాలిటీ రీ రికార్డింగ్ అందించనున్నారు జిబ్రాన్. ఇక ఈ సాహో చిత్రం ఇండిపెండెన్స్ డే కానుకగా అగస్ట్ 15 న ప్రపంచవ్యాప్తంగా బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ గా విడుదల కి సిద్ధమౌతోంది.
యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
బ్యానర్ - యువి క్రియేషన్స్
దర్శకుడు - సుజీత్
నిర్మాతలు - వంశీ-ప్రమోద్-విక్కీ
సినిమాటోగ్రాఫర్ - మధి
ఆర్ట్ డైరెక్టర్ - సాబు సిరీల్
ఎడిటర్ - శ్రీకర్ ప్రసాద్
పిఆర్వో - ఏలూరు శ్రీను
About Gopi
Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.
He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.
When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.
He can be reached at gopi@socialnews.xyz