Social News XYZ     

Gang Leader movie first look and motion poster launched on Hero Mohan Krishna’s birthday

హీరో మోహన్ కృష్ణ జన్మదినం సందర్భంగా 'గ్యాంగ్ లీడర్' చిత్ర ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల..!!

Gang Leader movie first look and motion poster launched on Hero Mohan Krishna's birthday

Gang Leader movie first look and motion poster launched on Hero Mohan Krishna’s birthday (Photo:SocialNews.XYZ)

మాణిక్యం మూవీస్, ఎస్.ఎమ్.కె ఫిలిమ్స్ పతాకాలపై సింగులూరి మోహన్ రావు నిర్మాతగా సిహెచ్.రవి కిషోర్ బాబు దర్శకత్వంలో బావమరదలు చిత్ర ఫేమ్ మోహన్ కృష్ణ , హరిణి రెడ్డి హీరో హీరోయిన్ లు గా నటిస్తున్న చిత్రం "గ్యాంగ్ లీడర్"... మళ్ళీ మొదలవుతుంది రచ్చ అనేది టాగ్ లైన్.. మనీషా ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేతలు కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ ఈ సినిమా ను సమర్పిస్తున్నారు.. షూటింగ్ షెరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్ర హీరో మోహన్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖ దర్శకుడు సాగర్ చిత్ర ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగా ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు..

 

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సిహెచ్.రవి కిషోర్ బాబు మాట్లాడుతూ..సినిమా 30:/: కంప్లీట్ అయ్యింది.. చిరంజీవి గారి సూపర్ హిట్ సినిమా టైటిల్ పెట్టడం వల్ల ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, సినిమా ని తెరకెక్కిస్తున్నాం.. ఇప్ప్పటివరకు తీసిన సినిమా అవుట్ ఫుట్ చాల బాగా వచ్చింది.. చిత్రంలో 6 పాటలు వచ్చాయి.. అన్ని ప్రేక్షకులు మెచ్చే విధంగా ఉన్నాయి.. త్వరలోనే ప్రేక్షకులముందుకు సినిమా ని తీసుకొస్తాం అన్నారు...

చిత్ర సమర్పకులు కిషోర్ రాఠీ మాట్లాడుతూ...1991 లో చిరంజీవి గారి గ్యాంగ్ లీడర్ సినిమా కి ఎంత పేరొచ్చిందో 2019 లో అయన అభిమాని అయిన మోహన్ కృష్ణ గ్యాంగ్ లీడర్ సినిమా కి కూడా అంతే పేరొస్తుంది.. అందరి ప్రశంశలు పొందేలా హీరో మోహన్ కృష్ణ చాల కష్టపడుతున్నారు..ఈ చిత్రాన్ని మనీషా ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రజెంట్స్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది అన్నారు..

హీరో మోహన్ కృష్ణ మాట్లాడుతూ...నా పుట్టిన రోజు సందర్భంగా గ్యాంగ్ లీడర్ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ అవడం ఆనందంగా ఉంది, నా అభిమాన హీరో అయిన చిరంజీవి గారి పుట్టిన రోజు ఆగష్టు 22 న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని అన్నారు..

చిత్ర నిర్మాత సింగులూరి మోహన్ రావు మాట్లాడుతూ..మా చిత్ర హీరో మోహన్ కృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ లను రిలీజ్ చేస్తున్నాం.. సినిమా షూటింగ్ ఫాస్ట్ గా జరుగుతుంది.. అందరు చాల కష్టపడుతున్నారు.. చిరంజీవి గారి సినిమా టైటిల్ పెట్టుకోవడం మరింత బాధ్యతను పెంచింది.. అభిమానులకు తగ్గట్లు ఈ సినిమా ను రూపొందించాం అన్నారు..

దర్శకుడు సాగర్ మాట్లాడుతూ.. గ్యాంగ్ లీడర్ అనగానే చిరంజీవి గారి సినిమా గుర్తొస్తుంది..ఆ సినిమా మెగా స్టార్ కి ఎంత మంచి పేరు తీసుకొచ్చిందో అంతే మంచి పేరు ఈ చిత్ర హీరో కి , దర్శకుడికి, ప్రొడ్యూసర్ కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. ఫస్ట్ లుక్ పోస్టర్ చాల ఇంప్రెసివ్ గా ఉంది.. సినిమా అవుట్ పుట్ కూడా అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను అన్నారు..

ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. సినిమా మోషన్ పోస్టర్ చాల బాగుంది.. చిరంజీవి గారి గ్యాంగ్ లీడర్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఆ సినిమా లాగే సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.. సినిమా కోసం అందరు చాల కష్టపడ్డారని సినిమా లుక్స్ చూస్తుంటే తెలిసిపోతుంది.. అల్ ది బెస్ట్ టూ టీం అన్నారు..

నటీనటులు : మోహన్ కృష్ణ, హరిణి రెడ్డి, సుమన్,తణికెళ్లభరణి, రంగస్థలం మహేష్, చిత్రం శ్రీను, రావూరి రమేష్, జబర్దస్త్ అప్పారావు, ఎల్.బి,శ్రీరామ్, జబర్దస్త్ బాబీ, వరహాల బాబు, బాలాజీ, గీత సింగ్, లడ్డు, సీత, జయలక్ష్మి, తదితరులు...

సాంకేతిక నిపుణులు :

ప్రొడ్యూసర్ : సింగులూరి మోహన్ రావు (MA , B.Ed )
బ్యానర్ : మాణిక్యం మూవీస్, ఎస్.ఎమ్.కె ఫిలిమ్స్
సమర్పణ : కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, మనీషా ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్
దర్శకుడు : సిహెచ్.రవి కిషోర్ బాబు
సినిమాటోగ్రఫీ : మురళి
ఎడిటర్ : నందమూరి హరి
ఫైట్ మాస్టర్ : రామ్ సుంకర
పబ్లిసిటీ డిజైనర్ : కాస అజయ్
స్టూడియోస్ : సారథి స్టూడియోస్, సంపత్ స్టూడియోస్
పి.ఆర్.ఓ : సాయి సతీష్

Facebook Comments