They say even a mother will not reach out to you unless you seek it. But Megastar Chiranjeevi garu is different. He has extended a helping hand to Film Newscasters Association of Electronic Media (FNAEM) without being asked. He invited the Association's executive members to his residence and extended the help for the health insurance of the journalist fraternity. Such is his Mega 'manasu'.
In the month of March, the Association distributed health cards and ID cards to its many members at a grand event. The association had invited Chiranjeevi garu to the event but he couldn't make it owing to a schedule of 'Sye Raa Narasimha Reddy'. He assured us that he will always be there for the Association.
Recently, the Megastar came to know about the activities of the Association. On Wednesday morning, members of the Association went to his house upon an invite. Without evening us asking for assistance, Chiranjeevi garu helped the Association financially, leaving us extremely delighted.
Speaking on the occasion, Chiranjeevi garu said, "The electronic, web and print media are like a bridge between film industry persons and the audience. It's highly commendable that the Association is providing health insurance to journalists. I have liked the concept of health cards. I have also learned about other welfare activities being undertaken by the Association. That's why I have come forward to do my bit to support it. I desire that my contribution will go towards health insurance. I assure that I and my family will always be there whenever journalists need any help."
ఫిల్మ్ న్యూస్‌క్యాస్టర్స్ అసోసియేషన్‌కు మెగాస్టార్ చిరంజీవి చేయూత
అడగనిదే అమ్మ అయినా పెట్టదని అంటుంటారు. మెగాస్టార్ చిరంజీవిగారిని అడగకుండానే సినిమా జర్నలిస్టులను ఇంటికి ఆహ్వానించి మరీ వారి ఆరోగ్య భద్రతకు సహాయం చేశారు. మెగా మనసును చాటుకున్నారు. మార్చిలో 'ఫిల్మ్ న్యూస్‌క్యాస్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా' సభ్యులకు హెల్త్ కార్డులు, ఐడి కార్డులు అందజేసిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవిగారిని ఆహ్వానించగా... 'సైరా నరసింహారెడ్డి' చిత్రీకరణలో బిజీగా ఉండటం వలన రాలేనని తెలిపారు. అసోసియేషన్‌కు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
జర్నలిస్టుల సంక్షేమానికి 'ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా' చేస్తున్న కార్యక్రమాలను తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవిగారు, బుధవారం ఉదయం అసోసియేషన్ కార్యవర్గ సభ్యులను ఆహ్వానించారు. అడగకుండానే తనవంతు సహాయం చేసి జర్నలిస్ట్‌లను ఆనందంలో ముంచెత్తారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "సినిమా ప్రముఖులకు, ప్రేక్షకులకు టెలివిజన్ మీడియా, వెబ్ మీడియా, ప్రింట్ మీడియా ప్రతినిధులు వారధి లాంటివారు. ఈ జర్నలిస్టుల ఆరోగ్య భద్రత కోసం 'ఫిల్మ్ న్యూస్‌క్యాస్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా' చేస్తున్న కృషి ప్రశంసనీయం. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వడం నాకు నచ్చింది. అలాగే, ఈ అసోసియేషన్ చేస్తున్న ఇతర సేవా కార్యక్రమాలు నాకు ఎంతగానో నచ్చాయి. అందుకని, నావంతుగా కొంత సహాయం చేస్తున్నాను. నేను ఇచ్చిన మొత్తాన్ని హెల్త్ కార్డుల కోసం వినియోగించవలసిందిగా కోరుతున్నాను. అలాగే, జర్నలిస్టులకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను, మా కుటుంబం అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నాను" అని అన్నారు.
Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.
He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.
When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.
He can be reached at gopi@socialnews.xyz
This website uses cookies.