“Saaho”, one of the highly invested action thriller films in the history of Indian cinema is almost completed the action part except for some crucial scenes. Rebel Star Prabhas actively is participating in promotional activities. He kept all his fans posted with regular updates from his film. Shades of Saaho, the making videos went viral within a few minutes of their release and showed the craze of Saaho among the Indian film lovers.
Now, team Saaho is all set to release the trailer. Prabhas fans across the globe are eagerly waiting for this moment. Makers announced that they are going to release the trailer on 13th of June.
'బాహుబలి' 1, 2 తరువాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠని మరింత పెంచుతూ మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం 'సాహో. ఇండిపెండెన్స్ డే కానుకగా అగస్ట్ 15 న ప్రపంచవ్యాప్తంగా బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ గా విడుదల కి సిద్ధమౌతోంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్స్ మేకింగ్ వీడియోస్ తో సంచలనం సృష్టించింది. ఇక ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సాహో ట్రైలర్ ను జూన్ 13 న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.
యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మూడు భాషల్లో ఒకేసారి షూట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఒకే రోజున విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రెబల్‌స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1 కి ఇప్పటికే ఇండియా మెత్తం క్రేజ్ వచ్చింది. ప్రపంచంలో వున్న రెబెల్‌స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు.
షేడ్స్ ఆఫ్ సాహో 2 తో ఈ చిత్రం హీరోయిన్ బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ బర్త్ డే కానుకగా విడుదల చేసిన వీడియో కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ స్పెషల్ వీడియో లో శ్రద్దా కపూర్ క్యారెక్టర్ లుక్ ని రివీల్ చేశారు. ఈ వీడియో లో ప్రభాస్, శ్రద్దా కపూర్ స్టైలిష్ లుక్స్... ఇంటర్నేషనల్ స్టాండర్ఫ్స్ మేకింగ్ హైలైట్ గా నిలుస్తున్నాయి. ఈ మేకింగ్ వీడియోతో ఈ సినిమా ఏ రేంజ్ లో తీస్తున్నారు అనేది మరింత స్పష్టమైంది. డినో యురి 18 కెడబ్ల్యూ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమా విజువల్స్ ని క్యాప్చర్ చేయడం మరో విశేషం. ఇంతటి భారీ ప్రతిష్టాత్మక చిత్రానికి రన్ రాజా రన్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. సాహోని ఓ విజువల్ వండర్ గా తీర్చిదిద్దేందుకు దర్శకుడు సుజిత్ తో పాటు హాలీవుడ్, బాలీవుడ్ కి చెందిన ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. హైటెక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో మైమరపించే యాక్షన్ సన్నివేశాలను అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మధి, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరీల్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ వంటి టాప్ టెక్నీషియన్స్ సాహో చిత్రానికి వర్క్ చేస్తుండడం విశేషం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రేక్షకుల, అభిమానుల అంచనాలను అందుకునేలా సాహోలో ప్రభాస్ స్టైలిష్ గా, ఓ కొత్త ఎనర్జీ తో కనిపించబోతున్నారు.
బ్యానర్ - యువి క్రియేషన్స్
దర్శకుడు - సుజీత్
నిర్మాతలు - వంశీ-ప్రమోద్
సినిమాటోగ్రాఫర్ - మధి
ఆర్ట్ డైరెక్టర్ - సాబు సిరీల్
ఎడిటర్ - శ్రీకర్ ప్రసాద్
పిఆర్వో - ఏలూరు శ్రీను
Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.
He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.
When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.
He can be reached at gopi@socialnews.xyz
This website uses cookies.