Nabha who was praised for her chirpy performance by the likes of K.Raghavendra Rao had dropped a few hints of glamour in last years' SIIMA award itself but she sealed the glamour deal with these extraordinarily glamorous stills which can be seen in the lyrical video which released 2 days ago and which has already is in #3 trending reaching about 3 million views.
Very few heroines are capable of being glamorous and acting well and Nabha is definitely one who has both and it is evident as she now has her hands full with 2 big films, iSmart Shankar, and Ravi Teja’s Disco Raja.
She just joined the set of Disco Raja recently and seems excited about her character in the film where she gets to share a few comic scenes with the actor Ravi Teja.
“We were very happy to see Nabha’s performance in the trailer of Nannu Dochukunduvate itself and wanted to cast her in this film, we signed her into our film before the release of Nannu Dochukunduvate,” said a team member of Disco Raja.
Nabha will mostly be signing another big movie soon say the sources! Looking forward to seeing Nabha in some really good roles in the future!!
దిమాక్ ఖరాబ్ చేస్తున్న నభా నటేష్
కొన్నాళ్ల క్రితం జరిగిన సైమా అవార్డ్స్ వేడుకలో ఇచ్చిన హాట్ పెర్ఫార్మెన్స్ తో దర్శకేంద్రుడి మన్ననలు అందుకున్న టాలెంటెడ్ & గ్లామరస్ హీరోయిన్ నభా నటేష్ ఇటీవల విడుదలైన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలోని 'దిమాక్ ఖరాబ్' లిరికల్ వీడియోలో కనిపించిన స్టిల్స్ లో గ్లామర్ డోస్ గట్టిగా అద్దానని సూచనలిచ్చింది. రెండ్రోజుల క్రితం విడుదలైన ఈ లిరికల్ వీడియో ప్రస్తుతం ఇండియావైడ్ #3 వ స్థానంలో ట్రెండింగ్ లో ఉంది. చాలా తక్కువ మంది కథానాయికలు మాత్రమే అందం-అభినయ సామర్ధ్యంతో మెప్పించగలరు. వారిలో నభా పేరు ముందు వరుసలో నిలుస్తుంది. ప్రస్తుతం రవితేజతో డిస్కో రాజా, రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమాలతో బిజీగా ఉన్న నభాకు టాలీవుడ్ నుంచి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి.
ఆమె ఇటీవలే డిస్కో రాజా షూట్ లో పాల్గొంది. రవితేజతో కలిసి నటించబోయే ఈ సినిమా గురించి నభా చాలా ఎగ్జైటెడ్ గా ఉంది. ఈ సినిమాలో రవితేజతో కలిసి ఆమె నటించబోయే కామెడీ సీన్స్ కోసం నభా వెయిట్ చేస్తోంది. "నభా కామెడీ టైమింగ్ 'నన్ను దోచుకోందువటే' ట్రైలర్లో చూసినప్పుడు బాగా నచ్చింది. అందుకే ఆ సినిమా విడుదలకు ముందే ఆమెను డిస్కో రాజా సినిమా కోసం సైన్ చేసాం' అని డిస్కో రాజా టీమ్ మెంబర్ తెలిపారు.
"నభాతో షూటింగ్ చాలా సరదాగా ఉంటుంది. ఆమె చాలా ఎనర్జిటిక్ & హాక్టివ్. ఆమె ఇస్మార్ట్ శంకర్ సినిమాలో చాలా క్రేజీ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పటివరకూ ఈ తరహా పాత్రను తెలుగు ప్రేక్షకులు చూసి ఉండరు" అని ఇస్మార్ట్ శంకర్ టీమ్ మేట్ తెలిపారు.
ఇప్పుడు అందరి చూపు త్వరలో విడుదల కానున్న "ఇస్మార్ట్ శంకర్" ట్రైలర్ మీద ఉంది. మరి లిరికల్ వీడియో స్టిల్స్ తోనే కుర్రాళ్ళ మతులు పోగొట్టిన నభా.. ట్రైలర్ లో ఎలా కనిపించబోతొందో చూద్దాం
This website uses cookies.