Social News XYZ     

‘Ishq is Risk’ movie launched

శేఖర్ మూవీస్ ప్రొడక్షన్ నెంబర్-2
"ఇష్క్ is రిస్క్" మొదలైంది!!

'Ishq is Risk' movie launched

‘Ishq is Risk’ movie launched (Photo:SocialNews.XYZ)

'ఈ 2మనసులు' చిత్రంతో సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన ప్రముఖ వ్యాపారవేత్త ఎస్.చంద్రశేఖర్.. ఆ చిత్రం నిర్మాణంలో వుండగానే, మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. జెయస్సార్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో.. శేఖర్ మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 2గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పేరు "ఇష్క్ is రిస్క్". రవిచంద్ర, యుగా యుగేష్, సాయి శ్రీవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చితానికి రాజ్ కింగ్ దర్శకుడు. జీవా, చమ్మక్ చంద్ర, తాగుబోతు రమేష్, నల్ల వేణు, బండ రఘు, మాధవి, జబర్దస్త్ పవన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైద్రాబాద్, మాదాపూర్ లోని డీజీపీ గెస్ట్ హౌస్ లో మొదలై ప్రస్తుతం మణికొండలోని మన స్టూడియోలో షూటింగ్ జరుపుకొంటోంది.

 

చిత్ర నిర్మాత ఎస్.చంద్రశేఖర్ మాట్లాడుతూ..'హాస్యానికి పెద్ద పీట వేస్తూ రూపొందుతున్న లవ్ ఎంటర్ టైనర్ "ఇష్క్ ఈజ్ రిస్క్". మంచి టీమ్ కుదిరింది. మంచి ఔట్ పుట్ వస్తుందనే నమ్మకం ఉంది" అన్నారు.

దర్శకుడు రాజ్ కింగ్ మాట్లాడుతూ.."దర్శకుడిగా ఇది నా రెండో చిత్రం. 'ఇష్క్ ఈజ్ రిస్క్' చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన మా నిర్మాత ఎస్.చంద్రశేఖర్ గారికి థాంక్స్చె
ప్పుకుంటున్నాను" అన్నారు.

ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్ అప్పాజీ, ఆర్ట్: విజయకృష్ణ, సినిమాటోగ్రఫీ: జగన్.ఏ, మ్యూజిక్: డేవిడ్, ప్రొడక్షన్ కంట్రోలర్: సతీష్ సంబెట, సమర్పణ: జేయస్సార్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్, నిర్మాత: ఎస్.చంద్రశేఖర్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: రాజ్ కింగ్!!

Facebook Comments

%d bloggers like this: