Konidela Productions’s Mega Chalivendram is one of a kind

కొణిదెల ప్రొడక్షన్స్‌ ఆధ్వర్యంలో ‘మెగా చలివేంద్రం’

Konidela Productions’s Mega Chalivendram is one of a kind (Photo:SocialNews.XYZ)

గత ఐదు సంవత్సరాల నుండి జూబ్లీహిల్స్‌ వద్ద గల చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌ వద్ద కొణిదెల ప్రొడక్షన్స్‌ తరఫున మెగాచలివేంద్రం నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటువంటి చలివేంద్రం తెలుగు రాష్ట్రాలలో ఎక్కడా లేదంటే అతిశయోక్తి కాదు.

ప్రతి రోజూ 3వేల నుండి 3500 మందికి చల్లని నీటితో అందరి దాహార్థిని తీరుస్తుంది. ఇక్కడ మినరల్‌ వాటర్‌ మాత్రమే వాడుతారు. భారీ రిఫ్రిజిరేటర్స్‌ ద్వారా కూలింగ్‌ పరిచిన చల్లని నీరు అందిస్తారు. మంచినీటి కోసం వాడే గ్లాసులు హైజెనిక్‌-ఖరీదుతో కూడుకున్నవి. మోడల్‌ చలివేంద్రంగా ఖరీదైన సెట్‌తో అత్యంత శుభ్రంగా ఉంచుతారు. ఇక్కడ నిత్యం నలుగురు మనుషులు ప్రత్యేకంగా పనిచేస్తారు.

మెగాస్టార్‌ చిరంజీవిగారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పరిశుభ్రమైన నీరు అందివ్వాలని, మొత్తం అంతా హైజెనిక్‌ మెయిన్‌టైన్‌ చెయ్యాలని ప్రతి ఒక్కరు చలివేంద్రంలో మంచినీరు త్రాగేలా ఉండాలని సిబ్బందికి పదే పదే చెబుతూ ఎంత ఖర్చు అయినా ఫర్వాలేదని లక్షలాది రూపాయలు ఈ చలివేంద్రానికి వెచ్చించడం విశేషం.

ప్రతిరోజూ ఈ చలివేంద్రం వద్ద అనేక వాహనాలతో పాటు సిటీ బస్సులు, ఖరీదైన కారులు, ఆటోలు, బైక్‌లు ఇంకా అనేకమంది పాదాచారులు అందరూ ఆగి మంచి నీరు త్రాగి వెళుతుంటారు. ఉదయం 8గంటల నుండి రాత్రి 9గంటల వరకు చలివేంద్రం అందుబాటులో ఉండటం విశేషం.

ఇంతవరకు ఈ చలివేంద్రంలో సుమారు 1,41,000 మంది తమ దాహార్థిని తీర్చుకున్నట్లు మెగా చలివేంద్రం సిబ్బంది తెలియజేశారు. మెగాస్టార్‌ ఎంతైనా చల్లని హృదయం కలవారని మరోసారి రుజువైంది.

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%