Social News XYZ     

KS 100 movie completes censor and ready for release

సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్ కి సిద్ధంగా ఉన్న "కెఎస్100" చిత్రం..!!

KS 100 movie completes censor and ready for release

Hyderabad: Stills from Telugu film "KS 100" in Hyderabad. (Photo: IANS)

మోడలింగ్ స్టార్స్ సమీర్ ఖాన్, శైలజ హీరో హీరోయిన్ లుగా చంద్రశేఖరా మూవీస్ పతాకంపై వెంకట్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం "కెఎస్100".. షేర్ దర్శకత్వం వహిస్తున్నారు.. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన రాగ, తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని 'ఎ' సర్టిఫికెట్ ని పొందింది.. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వెంకట్ రెడ్డి మాట్లాడుతూ " "కెఎస్100" చిత్రం అన్ని పనులు పూర్తిచేసుకుంది.. ఈ నెల 21 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.. నేడు సెన్సార్ పూర్తి చేసుకుని ఒక్క కట్ లేకుండా "ఏ" సర్టిఫికెట్ ని పొందింది.. సినిమా లో హారర్ సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో ఈ సర్టిఫికెట్ ఇచ్చారు.. సినిమా చాల బాగా వచ్చింది.. సినిమాలోని అంశాలను ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది అన్నారు..

 

చిత్ర చిత్ర దర్శకుడు మాట్లాడుతూ " కెఎస్100" చిత్రం అవుట్ ఫుట్ చాల బాగా వచ్చింది.. సెన్సార్ కూడా పూర్తి చేస్కుని ఒక్క కట్ లేకుండా "ఏ" సర్టిఫికెట్ పొందడం ఆనందంగా ఉంది.. ఈ నెల 21న సినిమా ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.. ఈ సినిమా ఇంతబాగా రావడానికి సహకరించిన అందరికి ధన్యవాదాలు" అన్నారు..

అక్షిత, అషి, పూర్వి సునీత, శ్రద్దా, నందిని, కల్పన అజీమ్, సుమన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి నవనీత్ చారి సంగీతం సమకూరుస్తుండగా, భాష్య శ్రీ సాహిత్యం అందించారు..

నటీనటులు : అక్షిత, అషి,పూర్వి, సునీత, శ్రద్దా, నందిని, కల్పన అజీమ్, సుమన్ తదితరులు

సాంకేతిక నిపుణులు :
మాటలు- కధ- కథనం-దర్శకత్వం: షేర్
నిర్మాత : వెంకట్ రెడ్డి
కెమెరా: వంశీ
మ్యూజిక్: నవనీత్ చారి
ఎడిటర్: లొకెష్ చందు, నాగార్జున
సాహిత్యం: భాష్య శ్రీ,
కొరియోగ్రఫీ: జొజొ
యాక్షన్: మాలేష్
నేపథ్యసంగీతం :రామ్ మోహన్ చారి
అసొషియెట్ డైరెక్టర్: రవితేజ
ఆర్ట్: సుదర్శన్

Facebook Comments