iSmart Shankar canning a song in Goa, Teaser on May 15th

గోవాలో రామ్ `ఇస్మార్ట్ శంక‌ర్‌` పాట చిత్రీక‌ర‌ణ‌... రామ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా రేపు టీజ‌ర్ విడుద‌ల‌

ఎన‌ర్జ‌టిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ఇస్మార్ట్ శంక‌ర్‌. డ‌బుల్ దిమాక్ హైద‌రాబాదీ ట్యాగ్ టైన్‌. రీసెంట్‌గా టాకీ పార్ట్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పాటల చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. అందులో భాగంగా గోవాలో రామ్ న‌భా న‌టేశ్‌ల‌పై ఓ సాంగ్‌ను చిత్రీక‌రిస్తున్నారు. భాను మాస్ట‌ర్ నృత్య రీతుల‌ను స‌మ‌కూరుస్తున్నారు.

రామ్ జోడిగా నిధి అగ‌ర్వాల్, న‌భా న‌టేశ్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. రామ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా టీజ‌ర్‌ను రేపు విడుద‌ల చేస్తున్నారు.
ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌కు మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. పూరిజ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి క‌నెక్ట్స్ ప‌తాకాల‌పై పూరి, ఛార్మి కౌర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

న‌టీన‌టులు:

రామ్
నిధి అగ‌ర్వాల్‌
న‌భా న‌టేష్‌
పునీత్ ఇస్సార్‌
స‌త్య‌దేవ్‌
ఆశిష్ విద్యార్థి
గెట‌ప్ శ్రీను
సుధాంశు పాండే త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ఫైట్స్‌: రియ‌ల్ స‌తీష్‌
సాహిత్యం: భాస్క‌ర‌భ‌ట్ల‌
ఎడిట‌ర్‌: జునైద్ సిద్ధికీ
ఆర్ట్‌: జానీ షేక్‌
సినిమాటోగ్ర‌ఫీ: రాజ్ తోట‌
మ్యూజిక్‌: మ‌ణిశ‌ర్మ‌
నిర్మాత‌లు: పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కౌర్‌
ద‌ర్శ‌క‌త్వం: పూరి జ‌గ‌న్నాథ్‌.

iSmart Shankar canning a song in Goa, Teaser on May 15th (Photo:SocialNews.XYZ)

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%