Social News XYZ     

Eakam-The Journey of Jobless God movie teaser released

'ఏకమ్' (ది జర్నీ ఆఫ్ ఎ జాబ్ లెస్ గాడ్ ) చిత్ర టీజర్ విడుదల

Eakam-The Journey of Jobless God movie teaser released

Eakam-The Journey of Jobless God movie teaser released (Photo:SocialNews.XYZ)

సంస్కృతి ప్రొడక్షన్స్ మరియు ఆనంద థాట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'ఏకమ్'. ఈ చిత్రం ద్వారా వరుణ్ వంశీ దర్శకుడిగా పరిచయం కాగా కళ్యాణ్ శాస్త్రి, పూజ, శ్రీరామ్ లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. శివుడి మూల కతఅంశం తో తెరకెక్కించిన ఈ నూతన చిత్ర టీజర్ ను 'మా' అధ్యక్షుడు నరేష్, బ్యానర్ ను నిర్మాత రాజ్ కందుకూరి మరియు అనిల్ సుంకర లు శనివారం ప్రసాద్ ల్యాబ్ లో విడుదల చేసారు.

 

ఈ కార్యక్రంలో మొదట నరేష్ మాట్లాడుతూ.. డిఫరెంట్ టైటిల్ తో తెరకెక్కిన చిత్రాలన్నీ విజయవంతం అయ్యాయి. ఈ 'ఏకమ్' చిత్రం కూడా చాలా కొత్తగా బ్యూటిఫుల్ గా కనబడుతోంది. ప్రతి జెనెరేషన్ కు కనెక్ట్ అయ్యేలా కూడా కనపడుతోంది. అందరికీ బెస్ట్ విషెస్ ను తెలువుతున్నానని అన్నారు. హీరో అభిరామ్ వర్మ మాట్లాడుతూ.. న్యూ జోనర్, క్లాసికల్ చిత్రం గా తెరకెక్కుతోంది ఈ చిత్రం. వరుణ్ గారు అద్భుతంగా తెరకెక్కించారు. అందరూ ఫెంటాస్టిక్ జాబ్ చేశారని అన్నారు.

డైరెక్టర్ వరుణ్ వంశీ మాట్లాడుతూ.. కళ్యాణ్ శాస్త్రి గారు నాకు 11 ఇయర్స్ నుంచి తెలుసు. ఆయన నా గురువు కూడా.. ఓ రోజు నా దగ్గర ఓ కథ ఉంది, డైరెక్టర్ అవ్వాలని అనుకుంటున్నానని కళ్యాణ్ గారికి చెప్పాను. కథ విని ఎవరో ఎందుకు మనమే చేద్దాం అని నాకు ప్రామిస్ చేశారు. అలా ఈ సినిమా మొదలైంది. సినిమా ఇండస్ట్రీ లోనికి రాకముందు చాలా ఈజీ అనుకున్నాను. కానీ సినిమా మొదలు పెట్టక తెలిసింది అంత ఈజీ గా స్టార్స్ అవరని. ఇక ఏకమ్ సినిమా విషయానికి వస్తే న్యూ జోనర్, పంచభూతాల ఆధారంగా సినిమా స్టోరీ ఉంటుంది. మిగతా విషయాలు మున్ముందు కార్యక్రమంలో తెలుపుతున్నానన్నారు.

నిర్మాత కళ్యాణ్ శాస్త్రి మాట్లాడుతూ... మా అమ్మాయి పేరు సంస్కృతి. తన పేరునే ఈ బ్యానర్ ను స్థాపించడం జరిగింది. అందుకు కారణం మాత్రం వరుణ్. అతను నా శిష్యుడు. చిన్నప్పటి నుంచీ తను కథలు బాగా చెప్పేవాడు. ఆ నమ్మకం తోనే ఈ సినిమా చేయడానికి నిర్ణయించుకున్నాను. కొత్తగా చూపించాలనే తపన, టాలెంట్ వరుణ్ కు ఉన్నాయి. అదే నమ్మకం నన్ను ప్రొడక్షన్ వైపు నడిపించింది. భారత దేశంలోనే మొట్టమొదటి సారిగా ఫిలాసఫిల్ ఫిక్షన్ గా మా ఏకమ్ చిత్రం రాబోతోంది. నిర్మాత కంటే అతి జాగ్రత్తగా సినిమాను తక్కువ బడ్జెట్ లో అద్భుతంగా తెరకెక్కించారు మా దర్శకుడు వరుణ్. ఈ సినిమాలో అందరూ బాగా నటించారు. తప్పకుండా మంచి పేరు తెచ్చుకుంటుందని ఆశిస్తున్నా అన్నారు.

రాజ్ కందుకూరి, అనిల్ సుంకర, కాశీ విశ్వనాథ్, అదితి, కల్పిక, సుక్కు, దయా, లక్ష్మణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అభినందనలు, అభిప్రాయాలను పంచుకున్నారు.

అభిరామ్ వర్మ, తనికెళ్ళ భరణి, అదితి మ్యాకల్, దయానంద్ రెడ్డి, కల్పిక గణేష్, లక్ష్మణ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్: జోస్ ఫ్రాంక్లిన్, డిఓపి: ఇక్బాల్ ఆజ్మి, లిరిక్స్: రఘు చతురెదుల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హేమ ప్రకాష్, నిర్మాతలు: ఎ. కళ్యాణ్ శాస్త్రి, పూజ ఎమ్., శ్రీరామ్ కె., డైరెక్టర్: బి. వరుణ్ వంశీ

Facebook Comments