Kanchana 3 movie song picturized with 1400 dancers

1400 మంది డాన్సర్స్ తో కోటి లక్షల ఖర్చుతో రాఘవ లారెన్స్ "కాంచన 3" సాంగ్ చిత్రీకరణ

Kanchana 3 movie song picturized with 1400 dancers (Photo:SocialNews.XYZ)

ముని, కాంచ‌న‌, కాంచ‌న‌-2 తో హార్ర‌ర్ కామెడీ చిత్రాల్లో సౌత్ ఇండియాలోనే భారీ స‌క్స‌ెస్ తో పాటు ఒక ట్రెండ్ సృష్టించిన రాఘ‌వ లారెన్స్ హీరోగా, స్వీయ ద‌ర్శ‌కత్వం లో ముని సిరీస్ నుంచి వ‌స్తున్న హార్ర‌ర్ కామెడీ చిత్రం కాంచ‌న‌-3. రాఘ‌వ లారెన్స్ అందించిన హార్ర‌ర్ చిత్రాల‌న్నీ సౌత్ ఇండియా లో బ్లాక్‌బ‌స్ట‌ర్స్ గా బాక్సాఫీస్ ని షేక్ చేసిన‌వే. అన్నిటిని మించి ఈ కాంచ‌న‌-3 మాత్రం లారెన్స్ కి స్పెష‌ల్ చిత్రంగా నిలవనుంది. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత బి.మ‌ధు విడుదల చేస్తున్నారు. రాఘ‌వేంద్ర ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ లో రాఘ‌వ నిర్మాణం లో ఈ సినిమా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో ఏప్రిల్ 19న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుద‌ల చేయనున్నారు. ప్రతి చిత్రం లో లాఘవ లారెన్స్ ఎన్నో థ్రిల్స్ ఇస్తూ వస్తున్నారు . ఈ సరి కూడా కాంచన 3 లో చాలా థ్రిల్స్ ఉన్నాయి . దాదాపు 1400 మంది డాన్సర్స్ తో కోటి ముప్పయి లక్షలు ఖర్చుపెట్టి పాట చిత్రీకరించారు .. .

ఈ సంద‌ర్బంగా బి . మధు మాట్లాడుతూ .... కాంచన 3 చిత్రం ఏప్రిల్ 19 న విడుదల చేస్తున్నాం. ఈ చిత్రం లో హీరో అండ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ తన నట విశ్వరూపం చూపించాడు అంతే కాదు గ్రాండ్ స్కేల్ లో ఈ చిత్రం తెరకెక్కింది. దాదాపు 1400 మంది డాన్సర్స్ తో మాస్టర్ అత్యద్భుతం గా సాంగ్ ని షూట్ చేశారు. 400 మంది అఘోరా గేటూపీస్ తో 1000 మంది డిఫ్రెంట్ లుక్ తో 6 రోజుల పాటు సాంగ్ చిత్రీకరణ చేశారు. లారెన్స్ కి కాంచన 3 చిత్రం తన కెరీర్ కే ప్రత్యేకమైంది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు . కథ, కథనం, గ్రాఫిక్స్ ప్రేక్షకుల్ని అబ్బురపరిచేలా ఉంటాయి. గతం లో వచ్చిన చిత్రాలు కంటే కథా బలంతో వస్తున్నాడు అలాగే మంచి సుర్ప్రిసె తో థ్రిల్ చేయనున్నాడు . ఇప్పటివరకు సిల్వర్ స్క్రీన్ మీద చూడని గొప్ప నటన మీరు ఈ నెల 19 న తెలుగు, తమిళ భాషల్లో చూస్తారు.. మా బ్యానర్ లో ఈ చిత్రం చాలా మంచి విజయాన్ని అందుకుంటుంది అని నా గట్టి నమ్మకం... మాస్ కమర్షియల్ చిత్రాలు తీయటం లో సిద్ధహస్తుడు మన లారెన్స్ మరొక్కసారి తానెంటో ప్రూవ్ చేసుకున్నాడు. తప్పకుండా మా కంచన అన్ని వర్గాల ఆకట్టుకుంటుంది. అన్నారు .

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%