Prabhu Deva and Tamannaah Bhatia’s Abhinetri 2 to release on May 1st

ప్రపంచవ్యాప్తంగా మే 1న ప్రభుదేవా, తమన్నా 'అభినేత్రి 2'

Prabhu Deva and Tamannaah Bhatia’s Abhinetri 2 to release on May 1st (Photo:SocialNews.XYZ)more
Prabhu Deva and Tamannaah Bhatia’s Abhinetri 2 to release on May 1st (Photo:SocialNews.XYZ)more

ఇండియన్‌ మైకేల్‌ జాక్సన్‌ ప్రభుదేవా, మిల్కీబ్యూటీ తమన్నా, బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ ప్రధానతారణంగా విజయ్‌ దర్శకత్వంలో 2016లో రూపొంది మంచి విజయాన్ని సాధించిన చిత్రం 'అభినేత్రి'. ఈ సక్సెస్‌ఫుల్‌ సినిమాకు సీక్వెల్‌గా 'అభినేత్రి 2' చిత్రం రూపొందుతోంది. ట్రైడెంట్‌ ఆర్ట్స్‌, అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకాలపై అభిషేక్‌ నామా, ఆర్‌.రవీంద్రన్‌ నిర్మాతలుగా విజయ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 'అభినేత్రి 2'లో ప్రభుదేవా, తమన్నాలతో పాటు నందితాశ్వేత, డింపుల్‌ హయాతి, కోవైసరళ కీలక పాత్రల్లో నటించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను జరుపుకుంటోంది. అన్నీ కార్యక్రమాలను విడుదల చేసి సినిమాను మే 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు అభిషేక్‌ నామా, ఆర్‌.రవీంద్రన్‌ మాట్లాడుతూ ''అభినేత్రి తెలుగులో దేవి పేరుతో విడుదలై పెద్ద విజయాన్ని సాధించింది. హారర్‌ కామెడీ జోనర్‌లో రూపొందిన సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలుజరుగుతున్నాయి. సినిమాను ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో మే 1న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.

ప్రభుదేవా, తమన్నా, నందితా శ్వేత, డింపుల్‌ హయాతి, కోవైసరళ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: సామ్‌ సి.ఎస్‌, సినిమాటోగ్రఫీ: అయాంకా బోస్‌, డైలాగ్స్‌: సత్య, పి.ఆర్‌.ఒ: కాకా, ఎడిటింగ్‌: అంటోని, నిర్మాతలు: అభిషేక్‌ నామా, ఆర్‌.రవీంద్రన్‌, దర్శకత్వం: .విజయ్‌.

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%