Social News XYZ     

Chitralahari Movie Pre Release Event Held

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో చేసిన 'చిత్రలహరి' నాకెంతో స్పెషల్ – సుప్రీం హీరో సాయితేజ్

Chitralahari Movie Pre Release Event Held

Chitralahari Movie Pre Release Event Held (Photo:SocialNews.XYZ)

సుప్రీమ్‌ హీరో సాయి తేజ్‌ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'చిత్రలహరి'. నివేదా పేతురాజ్‌, కల్యాణి ప్రియదర్శన్‌ హీరోయిన్స్‌. ఏప్రిల్‌ 12న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో థియేట్రికల్‌ ట్రైలర్‌ను కొరటాల శివ, సుకుమార్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా...

 

సుప్రీమ్‌ హీరో సాయితేజ్‌ మాట్లాడుతూ - ''కొరటాల శివ, సుకుమార్‌గారికి థాంక్స్‌. మా సినిమాకు ప్రారంభంలో ఎంతో బూస్ట్‌ ఇచ్చారు. మైత్రీ మూవీస్‌, చిత్రలహరి మూవీ నాకు స్పెషల్‌. ఎందుకంటే ఆరు సినిమాల ప్లాప్‌ తర్వాత నాతో సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. వారికి థాంక్స్‌. కిషోర్‌ ఎప్పటి నుండో పరిచయం. దేవిశ్రీ మ్యూజిక్‌కి నేను పెద్ద ఫాలోవర్‌ని నేను. ఆయనతో పనిచేయాలని మా అమ్మగారు కోరుకున్నారు. ఈ సినిమాతో ఆ కోరిక తీరింది. మా సినిమాకు ఆయన మ్యూజిక్‌ సపోర్ట్‌గా నిలిచింది. సునీల్‌ అన్నతో సినిమా చేయాలనుకునేవాడిని. ఈ సినిమాతో కూడా ఆ కోరిక తీరింది. వెన్నెలకిషోర్‌, పోసానిగారితో పనిచేశాను. మా హీరోయిన్స్‌ కల్యాణి, నివేదాలకు థాంక్స్‌. ఎన్ని ప్లాపులొచ్చినా, హిట్స్‌ వచ్చినా ఈ స్టేజ్‌పై ఉన్నానంటే కారణం మా మావయ్యలు.. మెగాభిమానులు. అందరికీ థాంక్స్‌. నన్ను తేజు బాబు అని పిలవొద్దు. తేజు అని పిలిస్తే చాలు. ఏప్రిల్‌ 12న విడుదలవుతున్న సినిమాను పాటల్ని హిట్‌ చేసినట్టే చేయాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

దర్శకుడు కిషోర్‌ తిరుమల మాట్లాడుతూ - ''నవీన్‌ ఎర్నేనిగారి వల్లే ఈ సినిమాకు చిత్రలహరి అనే టైటిల్‌ పెట్టాను. అలాగే యలమంచిలి రవి, మోహన్‌గారికి థాంక్స్‌. నా మూడు సినిమాలకు దేవిగారి మ్యూజిక్‌ పెద్ద ఎసెట్‌గా నిలుస్తూ వచ్చింది. కార్తీక్‌ కెమెరామెన్‌గానే కాదు.. కథలో నాతో పాటు ట్రావెల్‌ అవుతూ వచ్చారు. నేను రైటర్‌గా ఉన్నప్పటి నుండి తేజుతో పరిచయం ఉంది. నివేదా, కల్యాణి, బ్రహ్మాజీ, సునీల్‌ అన్న ఇలా అందరికీ థాంక్స్‌. తప్పకుండా అందరికీ నచ్చేలా సినిమా ఉంటుంది'' అన్నారు.

కొరటాల శివ మాట్లాడుతూ ''ఇంత మంది దర్శకులకు అవకాశం ఇస్తున్నారంటే సంస్థ ఎంతో గొప్పదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు దర్శకులందరూ మైత్రీలో ఓ సినిమా అయినా చేద్దామనుకునే రేంజ్‌కు సంస్థ చేరుకుంది. పెద్ద సినిమాలే కాకుండా మంచి కంటెంట్‌ ఉన్న సినిమాలు చేయాలని వారి తపన. ఈ సంస్థ ఇంకా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. రైటర్‌గా మా దగ్గర పనిచేసిన కిషోర్‌లో రా టాలెంట్‌ ఉంది. తిరుపతి కుర్రాడు. నేచురల్‌ టైమింగ్‌. ఏ మాత్రం పొల్యూట్‌ కాలేదు. తన నుండి చాలా చాలా మంచి సినిమాలు వస్తాయి. నాకు కథ చెప్పారు. తేజు నాకు కావాల్సిన వ్యక్తి. హానెస్ట్‌ వ్యక్తి. తను తప్ప ఎవరూ ఈ కథను న్యాయం చేయలేరనిపించింది. లైఫ్‌లో సక్సెస్‌ కోసం ఎంత కష్టపడతామో అందరికీ తెలుసు. ఈ సినిమాను చాలా పెద్ద సక్సెస్‌ను తేజు దక్కించుకుంటాడు. దేవి గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రేమ వెన్నెల సాంగ్‌ హాంటిగ్‌గా ఉంది'' అన్నారు.

సుకుమార్‌ మాట్లాడుతూ - ''ఇంత మంచి టైటిల్‌ను పెట్టినందుకు కిషోర్‌కు థాంక్స్‌. తను సెన్సిటివ్‌గా సినిమాలు చేస్తుంటాడు. తనకు ఆల్‌ ది బెస్ట్‌. ముందు ముందు ఇంకా సినిమాలు చేస్తాడు. మైత్రీ సంస్థ గొప్ప స్థాయికి చేరుకుంది. ఈ సినిమా ఒక ఉగాది పచ్చడిలాంటి సినిమా. ఓ సినిమా కోసం బాడీ లాంగ్వేజ్‌ మార్చుకునే హీరోలు తమిళంలో ఉంటారు. అలాంటి హీరోల్లా సాయి ఈ సినిమా కోసం కష్టపడ్డాడు. పాత్ర కోసం చాలా కష్టపడతాడు. మంచి సిచ్యువేషన్‌ను దొరికినప్పుడు దేవిని మించిన మ్యూజిక్‌ డైరెక్టర్‌ మనకు కనపడడు. గొప్ప మ్యూజిక్‌ ఇస్తాడు. ఈ సినిమాకు మంచి పాటలు కుదిరాయి. నివేదా, కల్యాణి, కార్తీక్‌ ఘట్టమనేని సహా అందరికీ ఆల్‌ ది బెస్ట్‌ ''అన్నారు.

రాక్‌స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌ మాట్లాడుతూ - ''చిత్రలహరి సాంగ్స్‌ను హిట్‌ చేసిన అందరికీ థాంక్స్‌. మైత్రీ మూవీ మేకర్స్‌ మా హోం బ్యానర్‌తో సమానం. కిషోర్‌ తిరుమలగారి చెప్పాలంటే ఎవరూ టచ్‌ చేయని సబ్జెక్ట్‌్రని ఆయన టచ్‌ చేస్తూ సినిమాలు చేస్తున్నారు. మా హార్ట్‌లను టచ్‌చేస్తున్నారు. ఆయనతో నేను చేసిన మూడో సినిమా. తప్పకుండా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతుంది. మనం వదలకుండా ప్రయత్నిస్తే కచ్చితంగా సక్సెస్‌ అవుతామని ఈ సినిమాలో చూపించారు. తేజు చాలా సిన్సియర్‌గా చేశారు. సునీల్‌గారి పాత్ర బాగా నవ్విస్తుంది. కల్యాణి, నివేదా పేతురాజ్‌ సహా అందరికీ కంగ్రాట్స్‌'' అన్నారు.

సునీల్‌ మాట్లాడుతూ - ''దేవిశ్రీ రిథమ్‌కు డ్యాన్స్‌ చేయాలనే కల ఈ సినిమాతో తీరింది. ఫెయిల్యూర్‌ తర్వాత వచ్చేది సక్ససే. మీలోని కోరికను కాంప్రమైజ్‌ చేసుకోకుండా ప్రయత్నిస్తే సక్సెస్‌ దొరుకుతుంది. చాలా మంచి పాత్ర చేశాను. కిషోర్‌ తిరుమలగారితో ఎప్పటి నుండో పరిచయం ఉంది. ఆయనలో మిడిల్‌ క్లాస్‌ మనస్తత్వం, ఆలోచనలు ఎక్కువ. వెటకారం కూడా చాలా ఎక్కువ. ఆయనతో నేను కూడా మాట్లాడలేను. అంత వెటకారంగా మాట్లాడుతారు. ఇక సాయి గురించి చెప్పాలంటే తనతో డైరెక్షన్‌ చేయాలనిపించేది. తనకు కూడా ఈ విషయం చాలా సార్లు చెప్పాను. దేవిశ్రీప్రసాద్‌ చాలా మంచి పాటలను ఇచ్చారు'' అన్నారు.

కల్యాణి ప్రియదర్శన్‌ మాట్లాడుతూ - ''అమేజింగ్‌ టీం దొరికింది. లహరి అనే పాత్ర చేశాను. సాయితేజ్‌, నివేదా, కిషోర్‌గారికి, నిర్మాతలకు థాంక్స్‌. దేవిగారు ఎక్సలెంట్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. అందరం ఎఫర్ట్‌ పెట్టి చేశాం. సొంత వాయిస్‌తో డబ్బింగ్‌ కూడా చెప్పాను. అందరం థియేటర్స్‌లో కలుస్తాం'' అన్నారు.

నివేదా పేతురాజ్‌ మాట్లాడుతూ - ''నిర్మాతలకు థాంక్స్‌. మంచి పాత్ర ఇచ్చారు. ఈ సినిమాలో పార్ట్‌ కావడం గౌరవంగా ఫీల్‌ అవుతున్నాను. దేవిశ్రీ ప్రసాద్‌గారి మ్యూజిక్‌కి నేను పెద్ద ఫ్యాన్‌ని. తేజ్‌ వండర్‌ఫుల్‌ కోఆర్టిస్ట్‌. అందరికీ థాంక్స్‌'' అన్నారు.

వెంకీ కుడుముల మాట్లాడుతూ - ''నాకు సాయిధరమ్‌ తేజ్‌ 14 ఏళ్లుగా తెలుసు. నేను నటుడిగా ఉన్న తరుణంలో ఎటు వెళ్లాలో తెలియడం లేదు. ఆ సమయంలో తను ఫోన్‌ చేసి, ఏం చేస్తున్నావ్‌ అన్నాడు. 'ఎటు వెళ్లాలో తెలియక కారు డ్రైవ్‌ చేసుకుంటూ వెళుతున్నా' అని చెప్పగానే 'రెండు నిమిషాల్లో ఫోన్‌ చేస్తాను' అని చెప్పేసి తను ఫోన్‌ చేసి ఇలా శ్రీధర్‌గారు సినిమాలో రచయితతో మాట్లాడాను. నువ్వు వెళ్లి కలువు. పని అవుతుంద'న్నాడు. ఆ సినిమాయే స్నేహగీతం. ఆ రైటర్‌ కిషోర్‌ తిరుమలగారు. ఆ సినిమాలో నటించడంతో పాటు డైలాగ్స్‌ కూడా రాశాను. తర్వాత నటుడిగా కొనసాగలేదు. కానీ.. దర్శకుడిగా మారాను. ఓ రకంగా చెప్పాలంటే సాయిధరమ్‌ తేజ్‌ నాకు తొలిసారి దారి చూపించింది. కాబట్టి వీరిద్దరినీ ఎప్పటికీ మరచిపోలేను'' అన్నారు.

బుచ్చిబాబు మాట్లాడుతూ ''ఎంటైర్‌ యూనిట్‌కు థాంక్స్‌'' అన్నారు.

బ్రహ్మాజీ మాట్లాడుతూ - ''గత ఏడాది ఉగాదికి చిట్టిబాబు(రంగస్థలం) సినిమా సక్సెస్‌ మీట్‌లో ఉన్నాను. ఈ ఉగాదికి మా తేజ్‌ బాబు సినిమాకు ఉన్నాను. ఈ సినిమా కూడా రంగస్థలం అంతా పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. కిషోర్‌ తిరుమల గారి డైలాగ్స్‌ అంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన దర్శకత్వంలో చేయాలని నిర్మాతలను అడిగి మరీ చేశాను. తేజుతో తొలిసారి కలిసి నటించాను. పర్సనల్‌గా మంచి వ్యక్తి. ఈ సినిమా తనకు సూపర్‌ డూపర్‌ హిట్‌ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

డైరెక్టర్‌ మారుతి మాట్లాడుతూ - ''మంచి టీం పనిచేసిన సినిమా. దేవిశ్రీ మ్యూజిక్‌ గురించి చెప్పనక్కర్లేదు. కిషోర్‌గారు మంచి కమిట్‌మెంట్‌తో సినిమా చేశారు. తేజకి ఈ సినిమా పెద్ద హిట్‌ కావాలి. యూనిట్‌కి ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

శివ నిర్వాణ మాట్లాడుతూ - ''ఈ జనరేషన్‌కి చిత్రలహరి గురించి పెద్దగా తెలియదు కానీ.. కానీ ఒకప్పుడు చిత్రలహరి తెలియనివాళ్లు ఉండరు. కిషోర్‌ తిరుమలగారికి, మైత్రీ మూవీ మేకర్స్‌తో మంచి అనుబంధం ఉంది. తేజుని చూస్తే మన ఇంట్లో కుర్రాడిని చూస్తున్నట్లు ఉంటుంది. దేవిశ్రీ ప్రసాద్‌గారికి కంగ్రాట్స్‌. సునీల్‌, బ్రహ్మాజీగారు యూనిట్‌కి అభినందనలు'' అన్నారు.

సాహు గారపాటి మాట్లాడుతూ ''టీం అందరికీ థాంక్స్‌'' అన్నారు.

సంతోష్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ - ''ఒకప్పుడు చిత్రలహరి కోం ఎలా వెయిట్‌ చేసేవాడినో.. ఈ చిత్రలహరి సినిమా కోసం అలా వెయిట్‌ చేస్తున్నాను. మైత్రీ సంస్థ ఈ సినిమాను ఎంత ప్రెస్టీజియస్‌గా తీసిందో నాకు తెలుసు. తేజు కెరీర్‌లో బెస్ట్‌ మూవీ అవుతుందని నమ్ముతున్నాను'' అన్నారు.

Facebook Comments