SD – Care Of Venchapalli movie launched

‘ఎస్‌డి’ త్వరలో షూటింగ్‌ ప్రారంభం!!

SD – Care Of Venchapalli movie launched (Photo:SocialNews.XYZ)more
SD – Care Of Venchapalli movie launched (Photo:SocialNews.XYZ)more

భాను ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ప్రణవి ప్రొడక్షన్స్‌ బేనర్స్‌ పై శ్రీసాయి అమృత ల‌క్ష్మి క్రియేష‌న్స్ సమర్పణలో గోదారి భానుచందర్‌, తిరుపతి పటేల్‌ సంయుక్తంగా పాలిక్‌ దర్శకత్వంలో రూపొందిస్తోన్న చిత్రం ‘ఎస్‌డి’ .కేరాఫ్‌ వెంచపల్లి’ ట్యాగ్‌లైన్‌. ‘బంగారి బాల‌రాజు’ ఫేం కరోణ్యా కత్రిన్‌, శ్రీజిత్‌ లావన్‌ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల‌లో షూటింగ్ ప్రారంభించుకోనుంది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు పాలిక్‌ మాట్లాడుతూ...‘‘1960 నుండి 1980 మధ్యలో జరిగిన యథార్థ సంఘటను బేస్‌ చేసుకుని ‘ఎస్‌డి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఓ గ్రామంలో నివ‌సించే శివుడు, దేవకి మధ్య స్నేహం మొదల‌వుతుంది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారుతుంది. ఈ క్రమంలో అదే గ్రామంలో ఒక దొర వీరి ప్రేమకు అడ్డుపడతాడు. ఆ దొరను ఎదిరించి వారి ప్రేమను ఎలా కాపాడుకున్నారు అనేది చిత్ర కథాంశం. ఇందులో స్వచ్ఛమైన ప్రేమ యొక్క నిర్వచనంతో పాటు ఫ్రెండ్‌షిప్‌ యొక్క గొప్పతనం చూపిస్తున్నాం. ప్రతి ఒక్కరికీ కనెక్టయ్యేలా స్క్రిప్టుని తీర్చిదిద్దాము. ఈ నెల‌లో షూటింగ్‌ ప్రారంభించి అగస్ట్‌ వరకు షూటింగ్‌ పూర్తి చేయడానికి ప్లాన్‌ చేసాం. షూటింగ్‌ మొత్తం మంచిర్యాల పరిసర ప్రాంతంలో ఉంటుంది. కొన్ని ఏళ్ల నాటి దొరల‌కు సంబంధించిన ఒక పురాతమైన కోటలో షూటింగ్‌ చేస్తున్నాం. ఇంత వరకు ఎవరూ చేయని అద్భుమైన లొకేషన్స్‌లో పిక్చరైజ్‌ చేయనున్నాం. ‘బంగారి బాల‌రాజు’ ఫేం కరోణ్యా కత్రిన్‌ ఇందులో దేవకిగా నటిస్తోంది. అలాగే శివుడు పాత్రలో శ్రీజిత్‌ లావన్‌ అనే కొత్త కుర్రాడు నటిస్తున్నాడు. ‘ఎస్‌ ’ అంటే శివుడు, ‘డి’ అంటే దేవకి ...వీరిద్దరి పేరు వచ్చేలా ఎస్‌డి టైటిల్‌ పెట్టాం. ప్రేమ, ఫ్రెండ్‌షిప్‌, సెంటిమెంట్‌, ఎమోషన్‌ ఇలా అన్ని రకా ఎమోషన్స్‌ ఉన్నాయి. ప్ర‌స్తుతం వ‌స్తోన్న చిత్రాల‌కు భిన్నంగా మా చిత్రం ఉంటుంద‌ని న‌మ్మ‌కంగా చెప్ప‌గ‌లం. నిర్మాత‌లు కూడా ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా నిర్మించ‌డానికి స‌హ‌క‌రిస్తున్నారు`` అన్నారు.

జగన్‌, జీవా, ప్రమోదిని, ప్రీతి నిగమ్‌, ప్రణవి, ఆకాష్‌, అభిజ్ఞాన్‌, ల‌క్కీ, ప్రేమ, వెంకటేష్‌, పంకజ్‌, శ్రావణ్‌, రోహిత్‌, వంశీకృష్ణ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: రఘురామ్‌; పాటలు:సురేష్‌ ఉపాధ్యాయ; సినిమాటోగ్రాఫర్‌: మల్లిఖార్జున్‌; స్టిల్స్‌:భరత్‌; ఎఫెక్ట్స్‌:చిరు అండ్‌ నరేందర్‌; నిర్మాత: గోదారి భానుచందర్‌, తిరుపతి పటేల్‌; కథ-స్ర్కీన్ ప్లే -మాట‌లు-ద‌ర్శ‌క‌త్వంః పాలిక్‌.

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%