U/A సర్టిఫికెట్ తో ఉగాది కానుకగా ఏప్రిల్ 6న "ప్రేమకథాచిత్రమ్ 2" గ్రాండ్ రిలీజ్
ఆర్.పి.ఏ క్రియేషన్స్ పతాకం పై ప్రముఖ నిర్మాత సుదర్శన్ రెడ్డి సారథ్యంలో తెరకెక్కుతున్న హార్రర్ కామెడీ సినిమా ప్రేమకథాచిత్రమ్ 2. గతంలో ఇదే బ్యానర్ లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి, హారర్ కామెడీ సినిమాలకు తెలుగునాట ట్రెండ్ క్రియేట్ చేసిన ప్రేమకథా చిత్రమ్ కు సీక్వెల్ గా ప్రేమకథాచిత్రమ్ 2 రెడీ అయింది. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని క్లీన్ U/A సర్టిఫికెట్ పొందింది. సెన్సార్ సభ్యుల ప్రశంసలతో ఈ సినిమా పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకుంది. ఈ చిత్రంతో హరి కిషన్ దర్శకుడుగా పరిచయమౌతున్నాడు. సుమంత్ అశ్విన్, సిద్ధి ఇద్నాని జంటగా నటిస్తున్నారు. ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రంలో తన పెర్‌ఫార్మెన్స్ తో తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్న నందిత శ్వేత మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. సూపర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా మొదటి పార్ట్‌కి ధీటుగా వస్తున్న ఈ చిత్రానికి నందిత శ్వేతా నటన మరో ప్లస్ అవుతుంది. "ప్రేమ కథా చిత్రం 2" చిత్రానికి మరో ఆకర్షణ రావు రమేష్. ఆయన నటనకే కాదు వాయిస్ కు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రం రావు రమేష్ వాయిస్ ఓవర్ తో నడుస్తుంది. తాజాగా విడులైన ఈ సినిమా ట్రైలర్ కు సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ లభించింది. ఉగాది సందర్భంగా ఏప్రిల్ 6న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రేమకథా చిత్రమ్ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దీనికి సీక్వెల్ గా వస్తున్న ప్రేమకథాచిత్రమ్ 2 ని కూడా అంతే క్రేజ్ తో రూపొందిస్తున్నాం. ఈ చిత్రం సెన్సార్ సభ్యుల ప్రశంసలతో క్లీన్ U/A సర్టిఫికెట్ పొందింది. ఇక ఈ చిత్రంలో నందిత శ్వేత మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే సుమంత్ అశ్విన్ హీరోగా, సిధ్ధి ఇద్నాని మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. విధ్యుల్లేఖ, ప్రభాస్ శ్రీను మధ్య వచ్చే కామెడీ హిలేరియస్ గా ఉంటుంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేశాము. ఉగాది సందర్భంగా ఏప్రిల్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నాం. పూర్తి సర్‌ప్రైజింగ్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న మా ప్రేమకథాచిత్రమ్ 2 అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకముంది. అని అన్నారు
నటీనటులు.. సుమంత్ అశ్విన్, నందిత శ్వేత, సిధ్ధి ఇద్నాని, కృష్ణ తేజ, విధ్యులేఖ, ప్రభాస్ శ్రీను, ఎన్.టి.వి.సాయి తదితరులు నటిస్తున్నారు.
సాంకేతిక నిపుణులు :
కెమెరామెన్ - సి. రాం ప్రసాద్,
ఎడిటర్ - ఉద్ధవ్ యస్.బి
సంగీతం - జె.బి
డైలాగ్ రైటర్ - గణేష్
లిరిక్ రైటర్- అనంత్ శ్రీరామ్,కాసర్ల్య శ్యామ్, పూర్ణా చారి.
పీఆర్వో - ఏలూరు శ్రీను
ఆర్ట్ - కృష్ణ
కో ప్రొడ్యూసర్స్ - ఆయుష్ రెడ్డి, ఆర్ పి అక్షిత్ రెడ్డి
నిర్మాత - ఆర్. సుదర్శన్ రెడ్డి
దర్శకుడు - హరి కిషన్
This website uses cookies.