Social News XYZ     

Kona Venkat clarifies regarding his family’s political association, YSRCP, Jana Sena & Pawan Kalyan

నిన్న సాక్షి పేపర్ లో వచ్చిన నా ఇంటర్వ్యూ కి సంబంధించి కొంత క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను :

Kona Venkat clarifies regarding his family’s political association, YSRCP, Jana Sena & Pawan Kalyan

మా కుటుంబం నేను పుట్టక ముందునుండే మా సొంత ఊరైన బాపట్ల లో రాజకీయాల్లో ఉంది .. మీలో చాలామందికి ఈ విషయం తెలుసు. మా తాత గారైన శ్రీ కోన ప్రభాకర రావు గారు కాంగ్రెస్ పార్టీలో పలుమార్లు ఎం.ల్ .ఏ గా, మంత్రిగా , అసెంబ్లీ స్పీకర్ గా , ఉమ్మడి రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రసిడెంట్ గా , మూడు రాష్ట్రాలకు గవర్నర్ గా ఒక మచ్చలేని నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానం కొనసాగించారు. ఆయన మరణం తర్వాత మా బాబాయ్ గారైన కోన రఘుపతి గారు 1995 నుండి ప్రజా సేవలోకి రావడం జరిగింది. తన సొంత ఆస్తులు కరిగించుకుంటూ ప్రజాసేవలో కొనసాగారు. 2014 ఎన్నికల్లో మా కుటుంబానికి , కోన రఘుపతి గారికి ఉన్న ప్రజాదరణ ని గుర్తించి జగన్ గారు YSRCP తరుపున పోటీచేసే అవకాశం ఇవ్వడం, గెలవడం జరిగింది.

 

ఈ ఎన్నికల్లో నేను ప్రత్యక్షంగా పాల్గొని నా వంతు కృషి నేను చేశాను. 1983 తర్వాత తిరిగి 2014 లో బాపట్ల లో కోన కుటుంబాన్ని ప్రజలు ఆదరించారు. ఆ సందర్భంలో నా మిత్రుడైన పవన్ కళ్యాణ్ కూడా ఆయన్ని అభినందించారు. 2014 తర్వాత జనసేన ని బలోపేతం చేసే సందర్భం లో , ప్రజలలోకి తీసుకెళ్లే సందర్భంలో పలుమార్లు నేను ఓపెన్ గానే సపోర్ట్ చేయ్యడం జరిగింది. ఈ క్రమంలో YSRCP క్యాడెర్ నుండి కూడా లోకల్ గా విమర్శలు ఎదుర్కొన్నాను. అయినా ఒక మిత్రుడిగా పవన్ కళ్యాణ్ శ్రేయోభిలాషిగా అతనికి మంచి జరగాలనే ఆశించి మౌనంగా ఉండిపోయాను. అది నా వ్యక్తిగతం అనే చెప్పాను. నా personal loyalty వేరు , నా Political loyalty వేరు. 30 years తర్వాత మా కుటుంబాన్ని నమ్మి ఆదరించింది YSRCP పార్టీ , జగన్ గారు. అది మేము ఎప్పటికి మరచిపోలేము.

ఇంక నా interview సంగతికి వస్తే, మా బావగారైన ద్రోణంరాజు శ్రీనివాస్ గారు వైజాగ్ దక్షిణ నియోజకవర్గము నుండి YSRCP అభ్యర్థి గా పోటీచేస్తున్నారు. అలాగే నా మిత్రుడైన MVV సత్యనారాయణ గారు వైజాగ్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. వీరిద్దరికి ప్రచారం చేయ్యడానికి వైజాగ్ వెళ్లడం జరిగింది. అప్పుడు సాక్షి పేపర్ వారు నన్ను ఇంటర్వ్యూ చెయ్యడం జరిగింది. ఆ సందర్భంగా పలు విషయాలపై నా అభిప్రాయాలు ఖచ్చితంగా చెప్పడం జరిగింది.

నా మిత్రుడైన పవన్ కళ్యాణ్ గారి గురించికూడా అడగడం జరిగింది . తన నిజాయితీ గురించి , తన వ్యక్తిత్వం గురించి దగ్గర నుండి చూసిన వ్యక్తిగా నిర్మొహమాటం గా చెప్పడం జరిగింది. పొలిటికల్ గా తనకి మంచి జరగాలని కోరుకునేవాళ్లలో నేను మొదటి వ్యక్తిని అని చెప్పడం కూడా జరిగింది(ఇది రాయలేదు). పొలిటికల్ గా మీరు విభేదించే అంశాలు ఉన్నాయా అని అడిగినప్పుడు, మాయావతి గారితో పొత్తు విషయంలో, తెలంగాణ విషయంలో ఎవరో తనని మిస్ గైడ్ చేసారు వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం జరిగింది. ఇది కూడా ఎందుకు చెప్పానంటే , కొంతకాలం క్రితం పవన్ కళ్యాణ్ KCR గారిని కలిసిన సందర్భంగా తనే స్వయంగా వాళ్ళ సామరస్య పాలన గురించి మీడియా తో చెప్పడం జరిగింది. అందుకే ఇప్పుడు తను ఇస్తున్న ప్రకటనల మీద నాకు అనుమానం వచ్చింది అంతే.

చివరిగా నేను చెప్పేదేంటంటే, మన రాజకీయ ఆలోచనలు, మన కులాలు, మతాలు, ప్రాంతాలు, ఆర్ధిక స్థోమతలు, ఇవేవి స్నేహానికి అడ్డుగోడలు కాకూడదు. I once again wholeheartedly wish him the best in his journey to achieve what he wants.

Facebook Comments
Kona Venkat clarifies regarding his family’s political association, YSRCP, Jana Sena & Pawan Kalyan

About Gopi

Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.

He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.

When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.

He can be reached at gopi@socialnews.xyz

%d bloggers like this: