Social News XYZ     

Nandita Swetha’s AKSHARA movie first song gets good response

‘‘అక్షర’’ మొదటి పాటకు మంచి స్పందన

Nandita Swetha's AKSHARA movie first song gets good response

Nandita Swetha’s AKSHARA movie first song gets good response (Photo:SocialNews.XYZ)

చదువుల ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థుల ఆత్మహత్యలు.. ఫీజులు కట్టలేక అప్పులపాలైన తల్లిదండ్రులు.. వంటి హెడ్ లైన్స్ తరచూ చూస్తున్నాం. అందుకు కారణమేంటీ.. అంటే అక్షరం అంగడి సరుకైంది. విద్య వ్యాపారమైంది అని.. ఇది తప్పని ఎవరికి వారు భావిస్తుంటారే.. తప్ప ఎవరూ మార్పును గురించి ఆలోచించరు. కానీ అమ్మకపు సరుకుగా మారిన కార్పోరేట్ విద్యా విధానం మారాలంటూ.. అతి పెద్ద వ్యాపారంగా మారిన అక్షరానికి ఆలంబనగా మారిందో యువతి. వివేకాన్ని ఇవ్వవలసిన విద్య వ్యాపారంగా మారితే ఆ వ్యవస్థ ఎంత దారుణంగా మారుతుందనేది అందరికీ తెలుసు. తెలిసీ ఉదాసీనంగా ఉండేవారిని సైతం ప్రశ్నిస్తూ అక్షర అనే యువతి సాగించిన పోరాటం నేపథ్యంలో వస్తోన్న సినిమా ‘అక్షర’. లేటెస్ట్ గా ఈ చిత్రం నుంచి ఓ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.

 

అక్షర సినిమా థీమ్ ను తెలియజేసేలా సాగే ఈ పాట విన్న ఎవరికైనా గూస్ బంప్స్ రావడం ఖాయం. చైతన్య ప్రసాద్ రాసిన ఈ పాటలోని ప్రతి అక్షరం ఓ అగ్నికణంలా కనిపిస్తుంది. ‘అసులదర.. నిశలు చెదర.. అక్షరాగ్ని శిఖలు ఎగసి ఆగ్రహించెలె.. సమరమిపుడే సమయమిపుడే కలం కూడ కత్తి దూసి కదం తొక్కెలే’’ అంటూ సాగే ఈ పాట ఈ యేడాదికే ది బెస్ట్ సాంగ్ గా నిలుస్తుందని విన్న ఎవరైనా ఒప్పుకుంటారు. గాడి తప్పుతోన్న విద్యావ్యవస్థ పై ఈ స్థాయిలో అక్షరాలను ఎక్కుపెట్టిన కవి మనకు కనిపించడు. సినిమా థీమ్ ను ఆవాహన చేసుకున్నాడా అనేలా చైతన్య ప్రసాద్ కలం కదం తొక్కింది. ‘‘చదువునే అమ్మితే దోపడీ సాగితే తిరుగుబాటొక్కటే రక్షా’’ అంటూ తేల్చివేస్తాడు. మొత్తంగా ఈ పాటతో సినిమా స్థాయి ఏంటో కూడా తెలిసిపోతుంది. అక్షర సినిమాను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూడాలి అనుకునేలా సాగుతుంది ఈ పాట.

అతి తక్కువ సమయంలోనే ప్రతిభావంతమైన నటిగా పేరు తెచ్చుకున్న నందిత శ్వేత టైటిల్ పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో ఇంకా సత్య, మధునందన్, షకలక శంకర్, శ్రీ తేజ, అజయ్ ఘోష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

టెక్నికల్ టీమ్:

కెమెరామాన్: నగేశ్ బెనెల్,

మ్యూజిక్ డైరెక్టర్ : సురేష్ బొబ్బిలి,

ఎడిటర్, జి.సత్య,

ఆర్ట్ డైరెక్టర్ : నరేష్ బాబు తిమ్మిరి,

కాస్టూమ్ డిజైనర్ : గౌరీనాయుడు,

లైన్ ప్రొడ్యూసర్స్: గంగాధర్, రాజు ఓలేటి,

పి.ఆర్. ఓ: జియస్ కె మీడియా,

సహ నిర్మాతలు: కె.శ్రీనివాస రెడ్డి, సుమంత్ కొప్పురవూరి

నిర్మాణ సంస్థ: సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్స్

నిర్మాతలు: సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ

రచన, దర్శకత్వం: బి. చిన్నికృష్ణ.

Facebook Comments