"కెఎస్100" హండ్రెడ్ పర్సెంట్ హిట్ అవుతుంది- దర్శకుడు షేర్
సమీర్ ఖాన్ హీరోగా శైలజ, సునీత పాండే, ఆశీర్వయ్, అర్షత, నందిత, శ్రద్ద హీరోయిన్స్ గా చంద్రశేఖర మూవీస్ పతాకంపై షేర్ దర్శకత్వంలో కె వెంకటరాం రెడ్డి నిర్మించిన సస్పెన్స్ హార్రర్ చిత్రం కెఎస్100. నవనీత్ చారి సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో మార్చ్ 23న హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో ఘనంగా జరిగింది.. ఈ కార్యక్రమంలో హీరో సమీర్ ఖాన్, హీరోయిన్స్ ఆశీర్వయ్, అర్షత, నందిత, శ్రద్ద, సంగీత దర్శకుడు నవనీత్ చారి, దర్శకుడు షేర్, నిర్మాత కె వెంకట రామ్ రెడ్డి, విలన్ సుమన్, లయన్ సాయి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.. ప్రత్యేక అతిధి భవారి, సాయి వెంకట్ కెఎస్100 ఆడియో సీడీలను రిలీజ్ చేశారు. మాంగో మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది.
దర్శకుడు షేర్ మాట్లాడుతూ... ఒక ఆడియన్ గా ఎలాంటి సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందో నాకు ఒక ఐడియా ఉంది. అలాగే ఈ చిత్రాన్ని అందరికీ నచ్చేలా తెరకెక్కించాను. సస్పెన్స్, థ్రిల్లర్, హారర్ జోనర్ లో సినిమా ఉంటుంది. యూత్ కి కావాల్సిన రొమాంటిక్ సన్నివేశాలు కూడా చిత్రం లో ఉన్నాయి. అమ్మాయిలు ప్రస్తుతం సమాజంలో ఏ విధంగా సఫర్ అవుతున్నారు. అనే పాయింట్ తీసుకొని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము. ఇన్ స్పైరింగ్ గా ఈ చిత్రం ఉంటుంది. నటీనటులు అందరూ బాగా చేశారు. గ్యారెంటీ గా ఈ చిత్రం హండ్రెడ్ పర్సెంట్ హిట్ అవుతుంది అన్నారు.
నిర్మాత కె వెంకట రామ్ రెడ్డి మాట్లాడుతూ... షేర్ చెప్పిన స్టోరీ ఇన్స్పైరింగ్ గా ఉండటంతో ఈ సినిమా తీశాను. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ చిత్రంలో ఉంటాయి. తప్పకుండా ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది..అన్నారు.
లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ... ఈ సినిమా ట్రైలర్ చూసి చాలా మంది ఫ్రెండ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తామని చెప్పారు. అంత బాగా క్రేజ్ ఉంది ఈ సినిమాకి. దాదాపు 200 థియేటర్స్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 'ఆర్ ఎక్స్100' కంటే ఈ చిత్రం బిగ్ హిట్ కావాలని కోరుకుంటున్నాను... అన్నారు.
భవారి మాట్లాడుతూ... నా స్నేహితురాలు తనయుడు షేర్ కష్టపడి తీసిన ఈ సినిమా మంచి హిట్ కావాలి. ట్రైలర్, సాంగ్స్ అన్నీ బాగున్నాయి. సినిమా కూడా బాగుంటుందని ఆశిస్తున్నాను.. అన్నారు.
డిఫరెంట్ పాయింట్ తో తెరకెక్కిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది.. ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాము....అని హీరోయిన్స్ అన్నారు..
This website uses cookies.