మహానటి ఫేమ్ బాలనటి సాయి తేజస్విని ప్రధాన ప్రాతలో ప్రియమణి "సిరివెన్నెల"
తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మళయాలీ భాషల్లో తనదైన నటనతో, విభిన్నమైన పాత్రలతో మెప్పించిన డస్కీ బ్యూటీ ప్రియమణి.. ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకోవడమే కాకుండా, కమర్శీయల్ హీరోయిన్ గా సైతం ప్రేక్షకాధరణ పొందారు. పెళ్లి చేసుకొని కొంత గ్యాప్ తీసుకొని... సిరివెన్నెల అనే తెలుగు చిత్రంతో ప్రియమణి రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర బృందం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉన్నారు. అలానే తాజాగా విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి సోషల్ మీడియాతో పాటు, సినీ అభిమానుల్లో సైతం విపరీతమైన, క్రేజ్ ఏర్పడింది. ఏ ఎన్ బి కోర్డినేటర్స్, శాంతి టెలీఫిలిమ్స్ బ్యానర్ పై కమల్ బోరా, ఏ ఎన్ భాషా, రామ సీత నిర్మాతలుగా ప్రకాష్ పులిజాల దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్లాసిక్ టైటిల్ "సిరివెన్నెల" అనే పేరు పెట్టడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో ప్రియమణితో పాటు... జూనియర్ మహానటిగా మంచిపేరు తెచ్చుకున్న బాలనటి సాయి తేజస్విని కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా సాయి తేజస్విని లుక్ ని విడుదల చేశారు సిరివెన్నెల చిత్ర బృందం. వీరిద్దరితో పాటు బాహుబలి చిత్రంలో కిలి కిలి భాషతో భయంకరమైన విలన్ గా నటించిన కాలకేయ ప్రభాకర్, సీనియర్ నటుడు అజయ్ రత్నం, రాకెట్ రాఘవ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సందర్భంగా
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.... తెలుగునాట రీఎంట్రీ ఇవ్వడానికి ప్రియమణి చాలా కాలంగా కథలు విన్నప్పటికీ, మా సిరివెన్నల కథ బాగా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ లో నటించేందుకు ఒప్పుకున్నారు. ప్రియమణి గ్లామర్, నటన మా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని నమ్మకం ఉంది. ఇక ప్రియమణితో పాటు మా సినిమాకు మరో ఆకర్షణ, బాలనటి సాయి తేజస్విని పాత్ర. ఇటీవలే విడుదలైన మహానటి సినిమాతో పాపులరైన సాయి తేజస్విని ఆ తరువాత మా సినిమాలోనే నటిస్తుండటం మాకు చాలా ఆనందాన్ని ఇస్తోంది. సాయి తేజస్విని పాత్ర చుట్టూనే సిరివెన్నలు రూపుదిద్దుకుంది. తాజాగా షూటింగ్ ముగించుకున్నాం. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నాం. త్వరలోనే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తాం. అని అన్నారు.
నటీనటులు - ప్రియమణి, కాలకేయ ప్రభాకర్, సాయి తేజస్విని, అజయ్ రత్నం, రాకెట్ రాఘవ తదితరులు
సాంకేతిక వర్గం
నిర్మాతలు - కమల్ బోరా, ఏ.ఎన్. భాషా, ఏ.రామసీతా రచన, దర్శకత్వం - ప్రకాష్ పులిజాల మ్యూజిక్ - ఏఎన్ బి కోర్డినేటర్స్ మ్యూజిక్ ప్రొడక్షన్ కంపెనీ సాంగ్స్ కంపోజింగ్ - మంత్ర ఆనంద్, కమ్రాన్ డిఓపి - కళ్యాణ్ సమి ఎడిటర్ - నాగేశ్వర్ రెడ్డి లిరిక్స్ - శ్రీరామ్ తపశ్వీ కొరియోగ్రాఫర్ - ఛార్లీ ఫైట్స్ - రామకృష్ణ ప్రొడక్షన్ కంట్రోలర్ - యోగానంద్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ - మోహన్ పరుచూరి, పీఆర్వో - ఏలూరు శ్రీను