Who is the heroine in Nagarjuna’s Manmadhudu 2?

నాగార్జున సినిమాలో హీరోయిన్ ఎవరు ?

Who is the heroine in Nagarjuna’s Manmadhudu 2? (Photo:SocialNews.XYZ)more

నాగార్జున రాహుల్ రవీంద్రన్ తో మన్మధుడు సినిమాకు సీక్వెల్ చేస్తున్న సంగతి తెలిసిందే. మార్చి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ యూరప్ లో జరగనుంది. సుకుమార్ కెమెరామెన్ గా పనిచెయ్యనున్న ఈ సినిమాకు ఛోటా కే ప్రసాద్ ఎడిటర్ గా పనిచెయ్యబోతున్నాడు.

ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ న్యూస్ లో నిజం లేదని సమాచారం. ఆమే కేవలం ఆడిషన్ కు మాత్రమే వచ్చిందని, తనను సినిమాకు తీసుకోలేదని టాక్ వినిపిస్తోంది.

తాజా సమాచారం మేరకు ఈ మూవీ కోసం రకుల్ప్రీత్ సింగ్ ను తీసుకొనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఈమెనే హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయం గురించి త్వరలో క్లారిటీ రానుంది. నాగార్జున భార్య అమల ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతోంది.

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%