చిరంజీవికి నో చెప్పిన అనుష్క?
భాగమతి సినిమా తరువాత అనుష్క హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యడానికి అంగీకరించింది. ఈ సినిమాలో అనుష్క ప్రధాన పాత్రలో కనిపించనుంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. అనుష్క చిరంజీవి సినిమాను వదులుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
వివరాల్లోకి వెళ్ళితే.. ఇటీవల దర్శకుడు కొరటాల శివ చిరంజీవి పక్కన అనుష్క అయితే బాగుంటుందని తనని సంప్రదించడం జరిగినట్లు సమాచారం. అయితే అనుష్క ఈ సినిమా చెయ్యడానికి నో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమెకు సినిమాలో జస్ట్ హీరోయిన్ పాత్రేనని ప్రాధాన్యం పెద్దగా లేదని సమాచారం.
తనకు ప్రాధాన్యం లేనందున అనుష్క ఈ పాత్ర చెయ్యడానికి అంగీకరించలేదని వార్త వినిపిస్తోంది. టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న అనుష్క మంచి పాత్రలు తనకు గుర్తింపు తెచ్చే పాత్రలు మాత్రమే చేయాలని తను భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
This website uses cookies.