త్రివిక్రమ్ అతన్ని రిపీట్ చెయ్యబోతున్నాడు !

Mumbai: Actor Boman Irani addresses at the launch of his production house ''Irani Movietone'' in Mumbai, on Jan 24, 2019. (Photo: IANS)
దర్శకుడు త్రివిక్రమ్ సినిమాల్లో నటులు ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటారు. ఆయన సినిమాల్లో నటించిన బొమైన్ ఇరానీ తాజాగా మరోసారి త్రివిక్రమ్ సినిమాలో నటించబోతున్నాడు. అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ చెయ్యబోతున్న లేటెస్ట్ సినిమాలో బన్నీకి తండ్రికి బొమైన్ ఇరాని నటించబోతున్నాడు.
త్రివిక్రమ్ బన్నీతో చేయబోయే సినిమా తండ్రి కొడుకులకు సంభందించిన కథ కావడం విశేషం. ఈ సినిమాలో బొమైన్ ఇరానీ అయితే బాగుంటుందని భావించిన త్రివిక్రమ్ అతన్ని సంప్రదించడం జరిగినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ వార్తను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
జులాయి, సత్యమూర్తి సినిమాల తరహాలోనే త్రివిక్రమ్ బన్నీతో ఎంటెర్టైనర్ సినిమా చెయ్యబోతున్నాడు. ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఎవరనేది త్వరలో తెలియనుంది. తమన్ ఈ మూవీకి సంగీతం అందించబోతున్నాడు. మార్చి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉండబోతోంది.