రాజకీయాలకి అతీతంగా అత్యద్భుతమైన ఓపెనింగ్స్ తో డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి "యాత్ర"
70 యమ్.యమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో 3వ చిత్రం గా యాత్ర చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఈ టైటిల్ ఎనౌన్స్ చేసిన దగ్గరనుండి వైఎస్.ఆర్ అభిమానుల్లోనే కాక సాధారణ ప్రజల్లో కూడా ఈ సినిమా పై ఆసక్తి నెలకొంది. దీనికి కారణం ఓ మహానేత చరిత్ర తెరకెక్కించటం. బయోపిక్ తీస్తున్నారంటే అసలు ఏం తీస్తున్నారు.. ఎలా తీస్తారు.. అది పాజిటివ్ గానా.. లేక నెగెటివ్ గానా అనే పలు సందేహాలు రేకెత్తాయి.. అసలు ఈ చిత్రం ఇప్పడు తీయవలసిన అవసరం ఏమిటి.. ఎన్నికల స్టంటా.. జగన్ కి సపోర్ట్ గా తీస్తున్నారా.. ఇలాంటి పలు ప్రశ్నలకి సమాధానం రేపు చిత్రం చెప్పబోతుంది. ఇదిలా వుంటే అసలు ఈ చిత్రం విషయానికొస్తే..
970 స్క్రీన్స్ లో భారీ ఓపెనింగ్స్ తో యాత్ర..
దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు పాద యాత్ర చేశారనే విషయం మాత్రమే తెలుగు ప్రజలకి తెలుసు కాని ఆ పాదయాత్ర తన రాజకీయ యాత్ర లో ఎంత కీలకమో కొంతమందికే తెలుసు. అప్పటి రాజకీయ పరిస్థితి దృష్ట్యా ఆయన ప్రజలకి దగ్గరగా వెళ్ళాలని నిశ్చయించుకున్నప్పుడు ఆయనకి ఎదురైన అనుభవాలు.. ఆటంకాలు.. వాటన్నింటిని కాదని కడప దాటి ప్రతి గడపలోకి స్వయంగా వెళ్ళి పేదవాడి సమస్యలు తెలుసుకోవడానికి ఈ యాత్ర మెదలుపెట్టారు వైఎస్ ఆర్. యాత్ర ప్రారంభమైన దగ్గరనుండి ప్రతి రైతుని, పేదవాడిని స్వయంగా కలిసి వారి సమస్యలు వినటమే కాదు... విన్న రాజశేఖరుడి హృదయం ఎలా స్పందించిందో ఆయనకే తెలుసు.. డాక్టర్ రాజశేఖరుడుగా ప్రారంభించిన యాత్ర రాజన్న గా ముగిసిందంటే ఆయన ప్రజలకి అంతగా దగ్గరయ్యారనేది అక్షరసత్యం.. దానికి నిదర్శనమే యాత్ర... ఫిబ్రవరి 8న విడుదల అవుతున్న ఈ చిత్రానికి బాక్సాఫీస్ స్పీడ్ అందుకోవడమే కాదు, అటు అమెరికా నుండి అనకాపల్లి వరకూ అనూహ్యమైన స్పందన లభిస్తోంది. ఫి.. సాధారణంగా ఒక సినిమా హీరో బయోపిక్ తీసినా లేదా బిగ్ కాస్టింగ్ తో తీసినా ఇంతటి భారీ ఓపెనింగ్స్ రావటం చూశాం. కాని మెట్టమెదటి సారిగా ఓ రాజకీయనాయకుడి బయోపిక్ తీస్తే ఒక్క ఓవర్‌సీస్ లోనే 180 స్క్రీన్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో 500 స్క్రీన్స్ లో ప్రపంచ వ్యాప్తంగా 970 స్క్రీన్స్ లొ విడుదల చేయటం ఈ సినిమా పై తెలుగు ప్రజల క్రేజ్ ని తెలియజేస్తుంది.
యాధృచ్చికం గా పెద్దాయన యాత్ర 68 రోజులు.. ఈ యాత్ర షూటింగ్ కూడా 68 రోజుల్లో పూర్తి
"నీళ్ళుంటే కరెంటు వుండదు.. కరెంటు వుంటే నీళ్ళుండవు..రెండూ ఉండి పంట చేతికొస్తే సరైన ధర వుండదు. అందరూ రైతే రాజంటారు..సరైన కూడు గూడు గుడ్డ నీడ లేని ఈ రాచరికం మాకొద్దయ్య..మమ్మల్ని రాజులుగా కాదు కనీసం రైతులుగా బ్రతకనివ్వండి చాలు..అని ప్రతి రైతు గొంతెత్తి అరుస్తున్న సమయం అది.. ఎవరైనా ఆదుకుంటారా అని రైతన్న ఎదురుచూసిన సమయం లో ఒక గొంతుక వినిపించింది.." నేను విన్నాను నేను వున్నాను అంటూ ఓ పిలుపు పేద ప్రజలవైవు నిలుచుంది.. నాయకుడిగా మనకు ఏం కావాలో తెలుసుకున్నాము.. కాని... జనానికి ఏం కావాలో తెలుసుకొలేకపోయాము అంటూ అదిష్టానాన్ని సైతం లెక్కచేయక పేద ప్రజల కష్టాల్ని వినటానికి కడప గడప దాటి ప్రజాయాత్ర ని పాదయాత్ర గా ప్రారంభించిన జననేతగా , మహనేతగా పేద ప్రజల గుండె చప్పుడుగా ఎప్పటికి పదిలమైన చోటు సుస్థిరపరుచుకున్న మహానాయకుడు దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర 68 రోజుల్లో పూర్తిచేసిన విషయం తెలిసిందే.. యాధృచ్చికంగా ఈ యాత్ర షూటింగ్ కూడా 68 రోజుల్లో పూర్తికావటం ఆ పెద్దాయన ఆశిస్సులుగా యూనిట్ సభ్యులు భావిస్తున్నారు.
రాజకీయనాయకుడి బయోపిక్ కాని రాజకీయాలు కాదు..
వై ఎస్ ఆర్ రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలక ఘట్టం.. ఆ సమయంలో జరిగిన ముఖ్య సంఘటనల సమాహారమే ఈ యాత్ర. 68 రొజులు సాగిన పాదయాత్ర లో రైతుల కష్టాలు, పేదవాళ్ళ ఆవేదనలు ప్రతిఓక్కరి భావోద్వేగాలు రాజన్న మనసుతో వినటమే ఈ చిత్రం లో కీలక భాగం.. ఎటువంటి రాజకీయాలు లేని రాజకీయ నాయకుడి కథే ఈ యాత్ర. ప్రతిఓక్కరూ ఈ చిత్రాన్ని చూసి భావోద్వేగానికి లొనవుతారు.. ఎందుకంటే కష్టం ఎవరికైనా కష్టమే అందుకు ఈ యూనివర్సల్ సబ్జక్ట్ ని తెలుగు భాషలొనే కాకుండా తమిళ, మలయాల భాషల్లో భారతదేశం మెత్తం విడుదల చేస్తున్నారు. చక్కటి ఎమోషనల్ కంటెంట్ తో చూసిన ప్రతి ప్రేక్షకుడి బరువైన గుండెతో దియెటర్స్ నుండి బయటకి రావటం జరుగుతుంది.
70 యమ్ యమ్ బ్యానర్ లో ఎమెషనల్ ఎంటర్‌టైనర్ గా యాత్ర
విజయ్ చిల్లా, శ.శి దేవిరెడ్డి నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మహనేత జీవితంలో కీలక ఘట్టాన్ని ప్రతిష్టాత్మకంగా శివ మేక సమర్పణ లో తెరకెక్కించారు. .. మడమతిప్పని నాయకుడు శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారి బయెపిక్ ని ఆనందో బ్రహ్మ దర్శకుడు మహి.వి.రాఘవ కొన్ని ఎమెషనల్ సీన్స్ చాలా బాగా తెరెక్కించారు. ఈ బ్యానర్ లో క్రైమ్ ఎంటర్‌టైనర్ గా భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ తో హర్రర్ ఎంటర్‌టైనర్ గా ప్రేక్షకుల్ని అలరించారు. ఈ చిత్రంలో ఆద్యంతం ఎమోషన్ తో కూడిన పాత్రలు, పాత్ర చిత్రణ కనిపిస్తాయి. ఎమోషనల్ ఎంటర్‌టైనర్ గా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల్ని అలరించనున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు ప్రజలందరూ తప్పకుండా చూడాల్సిన చిత్రం గా ఫ్యామిలీ ఎమోషన్ ని దర్శకుడు చూపించారు. ఈ చిత్రం కేవలం లోకల్ సబ్జెక్ట్ కాదు.. యూనివర్సల్ గా ప్రతి సినిమా లవర్ చూడాల్సిన చిత్రం గా ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకురానుంది.
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పరకాయ ప్రవేశం.
దర్శకుడు మహి ఈ కథ మమ్ముట్టి కి చెప్పినప్పడు ఈ కథలోని పాత్రలు వాటి కష్టాలు ఆయన్ని కలచి వేశాయి. ఆ తరువాత ఆయన రాజశేఖర్‌రెడ్డి గారి గురించి పూర్తిగా తెలుసుకుని పాత్ర లో పరకాయ ప్రవేశం చేశారు. ఇటీవల ఆయన మాట్లాడుతూ.. ఈ కథ రాయజకీయ నాయకుడి కథ మాత్రమే రాజకీయాలు వుండవు.. ప్రజల కష్టాలు, రైతు బాదలు వుంటాయి.. ఇవన్ని భారతదేశం అంతటా వుంటాయి.. ఏ రైతు ని అడిగినా ఏ పేదవాడిని అడిగినా వారి కష్టాలు చెప్తారు.. అని చెప్పారు.
వైయస్ జగన్ గారికి... వారి ఫ్యామిలీ కి ప్రత్యేక ధన్యవాదాలు..
ఈ చిత్రం చేయాలనుకున్నప్పటి నుండి రేపు విడుదల వరకూ వై.యస్ జగన్ గారు కాని వారి ఫ్యామిలి కాని ఎక్కడా అభ్యంతరాలు పెట్టలేదు సరికదా కనీసం వివరాలు కూడా అడగలేదు.. దర్శకుడికి , ప్రోడక్షన్ కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం ఆయన గొప్పతనానికి నిదర్శనం.. ఇటీవలే దర్శకుడు మహి కలిసినప్పుడు కూడా మీ నాయకుడి చిత్రం మీరు తీస్తున్నారు.. ఆయన గురించి మీకే బాగా తెలుసు.. నాయన చేసిన పనులు చెప్పండి. చాలు అని సున్నితంగా చెప్పటం యూనిట్ లో నూతనోత్సాహం కలిగించింది. ఈ సందర్బంగా దర్శక, నిర్మాతలు వైయస్ జగన్ గారికి, వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
నటీనటులు..
మమ్ముట్టి, రావ్ రమేష్, జగపతిబాబు, సుహాసిని, అనసూయ, పోసాని, సచిన్ కడ్కర్, వినోద్ కుమార్, జీవా, 30 ఇయర్స్ పృథ్వి.....తదితరులు
సాంకేతిక వర్గం
సినిమాటోగ్రాఫర్ - సత్యన్ సూర్యన్
మ్యూజిక్ - కె ( క్రిష్ణ కుమార్ )
ఎడిటర్ - శ్రీకర్ ప్రసాద్
సాహిత్యం - సిరివెన్నెల సీతారామ శాస్త్రి
ప్రొడక్షన్ డిజైన్ - రామకృష్ణ, మోనిక సబ్బాని
సౌండ్ డిజైన్ - సింక్ సౌండ్
వి ఎఫ్ ఎక్స్ - Knack Studios, పిక్సాలయిడ్
పి ఆర్ ఓ - ఏలూరు శ్రీను
సమర్పణ - శివ మేక
బ్యానర్ - 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్
నిర్మాతలు - విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ - మహి వి రాఘవ్
About Gopi
Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.
He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.
When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.
He can be reached at gopi@socialnews.xyz