పవన్ కల్యాణ్ ను భర్తీ చేసిన సాయి ధరమ్ తేజ్ .
పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి రాకముందు నిర్మాత ఏ.ఎమ్.రత్నం తో సినిమా చేసేందుకు అంగీకరించాడు. ఆ మద్య ఈ నిర్మాత దర్శకుడు ఎస్.జె.సూర్య తో పవన్ కల్యాణ్ సినిమా పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. కానీ పవన్ రాజకీయాల్లో బిజీగా అవ్వడంతో ఈ సినిమా చెయ్యలేకపోయాడు.
కానీ ఆ నిర్మాత దగ్గర పవన్ అప్పుడే కొంత అన్వన్స్ డబ్బు తీసుకుంటున్నట్లు సమాచారం. కానీ సినిమా చెయ్యలేకపోయాడు కావున ఆ సినిమా స్థానంలో సాయి ధరం తేజ్ తో సినిమా చెయ్యమని నిర్మాతకు పవన్ కల్యాణ్ సూచించినట్లు వార్తలు వస్తున్నాయి.
మరి పవన్ కల్యాణ్ స్థానంలో సాయి ధరం వచ్చాడు కానీ ఈ సినిమాకు దర్శకుడు ఎవరనేది తెలియాల్సి ఉంది. సాయి ప్రస్తుతం చిత్రాలహరి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు, ఈ సినిమా తరువాత ఏ.ఎమ్.రత్నం సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
This website uses cookies.