Naga Chaitanya gets Ram’s movie?

రామ్ సినిమా చైతూకి వెళ్లిందా ?

గరుడవేగా సినిమాతో విజయం సాధించిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు తన నెక్స్ట్ సినిమా రామ్ తో చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ సినిమా మొదలవ్వలేదు. బడ్జెట్ కారణాల వల్ల సినిమా ఆగిపోయింది. తాజా సమాచారం మేరకు ప్రవీణ్ సత్తారు అదే కథను నాగ చైతన్య కు వినిపించినట్లు సమాచారం.

నాగార్జున తో కింగ్, రగడ వంటి సినిమాలు చేసిన కామాక్షి మూవీస్ కొంత గ్యాప్ తరువాత మళ్ళీ సినిమా స్టార్ట్ చేయబోతోంది. నాగచైతన్య, ప్రవీణ్ సత్తారు చేయబోతున్న సినిమాకు కామాక్షి మూవీస్ నిర్మించడం విశేషం. కథ చర్చల్లో ఉన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ఉంటుందని తెలుస్తోంది. నాగ చైతన్య ప్రస్తుతం మజిలీ అనే సినిమాలో నటిస్తున్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు.

ప్రవీణ్ సత్తారు, చైతు సినిమా అడ్వెంచర్ సినిమాగా ఉండబోతోందని సమాచారం. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు చైతుకు హిట్ ఇస్తాడేమో చూడాలి. నాగ చైతన్య ఈ సినిమాతో పాటు నాగార్జున తో కలిసి బంగార్రాజు, వెంకటేష్ తో కలిసి వెంకీమామ సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్వరలో ఆ చిత్రాలు ప్రారంభం కానున్నాయి.

Facebook Comments
Share

This website uses cookies.