ఓ వెరైటీ పాత్ర చేయగలను అని `బిచ్చగాడా మజాకా`తో పేరొస్తుంది
`శివాజీ` తర్వాత `బిచ్చగాడా మజాకా`లో డిఫరెంట్ రోల్ చేశాను! - సుమన్
బిచ్చగాడా మజాకా
(బ్రేకప్ లవ్‌స్టోరీ) ఫిబ్రవరి -1న రిలీజవుతోంది. అర్జున్‌రెడ్డి, నేహా దేశ్‌పాండే నాయకానాయికలుగా నటించారు. కె.ఎస్.నాగేశ్వరరావు దర్శకుడు. ఎస్.ఎ.రెహమాన్ సమర్పణలో బి. చంద్రశేఖర్ నిర్మించారు. శ్రీవెంకట్ సంగీతం అందించారు. రిలీజ్ సందర్భ ంగా హీరో సుమన్ ఇంటర్వ్యూ ఇది...
ఈ సినిమాలో మీ రోల్ ఏంటి?
ఈ బ్యానర్ పేరు వెరైటీ. అందుకు తగ్గ చిత్రమిది. దర్శకుడు కె.ఎస్.నాగేశ్వరరరావు.. మేం పాత బ్యాచ్ .. చాలాకాలంగా కలవలేదు. ఆయనే ఫోన్ చేసి ఈ సినిమాలో మీరు నటిస్తే బావుంటుందని అన్నారు. దర్శకుడు తొలిసారి సినిమా చేసినా పరిశ్రమలో సుదీర్ఘ అనుభవం ఉన్న వాడు. ఆయన కథ చెప్పడం మొదలు పెట్టాక నా పాత్ర వినగానే విభిన్న ంగా ఉందని అనిపించింది. రెగ్యులర్ హీరోయిన్ ఫాదర్ తరహా పాత్ర కాదు ఇది. పూర్తి కథ విన్నాను. ఇది రొటీన్ ప్రేమ కథా చిత్రం కానే కాదు. దీంట్లో కామెడీ, ట్రాజెడీ, నెగెటివ్, పాజిటివ్ అన్నీ కలిసి ఉన్న పాత్ర నాది. చాలా ప్రాక్టికాలిటీ ఉన్న రోల్. నెగెటివిటీకి కారణం .. పాజిటివిటీకి లాజిక్ ఉన్న పాత్ర నాది. ఈ కారణాలన్నీ నాకు నచ్చాయి. పతాక సన్నివేశాల వరకూ టెన్షన్ ఉండేలా తెరకెక్కించారు. విభిన్నమైన పాత్రలో నటనకు ఆస్కారం ఉంటుంది. అలాగే దర్శకుడు వినిపించిన స్క్రీన్ ప్లే ఆకట్టుకుంది. సీన్ టు సీన్ తీసేప్పుడు కంటిన్యుటీతో పాటు కంటెంట్ మిస్సవ్వకుండా తీశారు.
దర్శకుడి గురించి?
* దర్శకుడు అనుభవజ్ఞుడు. రియల్ స్టార్ శ్రీహరితో మంచి సినిమాలు తీశారు. ఆయన అనుభవానికి అడుసుమిల్లి విజయ్ వంటి ఛాయాగ్రాహకుడు తోడవ్వడం ప్లస్ అయ్యింది. పరిమిత బడ్జెట్ చిత్రాలను వేగంగా పూర్తి చేయడం ఇంపార్టెంట్. కొన్ని ఇబ్బ ందులు ఎదురైనా ఒక మంచి సినిమాని తీయగలిగారు. ఇందులో నా పాత్ర ఎంతో ప్రత్యేకమైనదని చెప్పగలను.
హీరో కొత్త కుర్రాడు కదా.. బాగా నటించాడా?
*ఈ సినిమా హీరో అర్జున్ రెడ్డి కొత్త కుర్రాడే అయినా తాను ఎంతో బాగా చేశాడు. హీరో అంటే రొమాన్స్ , లవ్ అనే ట్రాక్ పక్కన పెడితే పెర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలో నటించాడు. పాటలు, ఫైట్స్ లో నూ చక్కగా చేశాడు. కొత్త హీరోలు కొన్ని సీన్ల విషయంలో ఇబ్బ ంది పడతారు. కానీ తను చాలా బాగా చేశాడు. కథానాయిక నేహా దేశ్ పాండే ఎమోషనల్ సీన్స్ లో చాలా బాగా నటించింది. తండ్రి- కుమార్తెల మధ్య ఎమోషనల్ సీన్స్.. లవర్ కోసం తపించే సీన్స్ బాగా చేసింది.
ఇతర పాత్రధారులపై మీ వ్యూ?
* ఈ సినిమాలో బాలాజీ చాలా చక్కని పాత్రలో నటించాడు. మంచి ఆర్టిస్టు ఆయన. ఈ సినిమా తనకు ఎంతో విభిన్నమైనది. నేనే ఆ పాత్ర చేసి ఉంటే బావుండేది అన్న ఫీలింగ్ కలిగింది. నా పాత్ర బావున్నా.. అంతకంటే మంచి పాత్ర తనది. సినిమాకి ఆయన మంచి అస్సెట్ అవుతాడు. అలాగే బాబూ మోహన్ పెర్ఫెక్ట్ ఆర్టిస్ట్. చాలా బాగా చేశారు. ఈ సినిమాలో పాత్ర ఆయనకు కరెక్ట్. సినిమా చూసి బయటకు వచ్చేప్పటికి ఆర్టిస్టులు గుర్తుంటారు.
కథలో యూనిక్ పాయింట్?
*అమ్మాయి - అబ్బాయి ప్రేమకథ రొటీన్ అయినా.. ఇందులో ఓ సందేశం ఆకట్టుకుంటుంది. కష్టపడి పని చేయడం ఎందుకు? షార్ట్ కట్ లో డబ్బు వచ్చేస్తే ఎంజాయ్ చేసేద్దాం అనే ఆలోచన ఉన్న యువతరానికి సంబంధించిన కథను చ ఊపించారు. కష్టపడి సంపాదించకుండా జనాల్ని మోసం చేస్తూ డబ్బు సంపాదించి హోదాను అనుభవించే తత్వ ం సరికాదని అంతర్లీనంగా మంచి పాయింట్ ని చెబుతున్నారు. కామెడీ, సెంటిమెంట్, ఎమోషన్, లవ్ తో పాటు మంచి సందేశం ఆకట్టుకుంటుంది. ఆడా మగా అనే తేడా లేకుండా అందరూ చూడాల్సిన చిత్రమిది. నిరుద్యోగులు చూడాల్సిన చిత్రమిది. అసభ్యత అన్నదే లేని కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది. ద్వ ంద్వార్థ సంభాషణలు లేని చిత్రమిది.
నిర్మాతే రచయిత కదా.. ఫ్రీడమ్ ఇచ్చారా?
*నిర్మాతల సహకారం ఎంతో గొప్పది. దర్శకనిర్మాతలు ఓ మంచి పాత్ర ఇచ్చినందుకు చాలా థాంక్స్. సుమన్ ఓ వెరైటీ పాత్ర చేశాడు అన్న పేరొస్తుంది.
శివాజీ - ది బాస్ చిత్రంలో పవర్ ఫుల్ పాత్రలో చేశారు.. అది అభిమానులు మర్చిపోరు కదా?
*శివాజీ సినిమా వేరు.. ఈ సినిమా వేరు. ఆ గ్రాండియారిటీతో పోల్చకుండా చూస్తే బిచ్చగాడా మజాకా
సినిమా విభిన్నమైనది. సుమన్ ఓ వెరైటీ పాత్ర చేయగలడు అని ఈ సినిమాతో పేరొస్తుంది. శివాజీ చూసినప్పుడు సుమన్ విలన్ ఏంటి? అన్నమయ్య చేసినప్పుడు సుమన్ వెంకటేశ్వర స్వామి ఏంటి? అన్నారు. ఆ తర్వాత వాళ్లే పొగిడారు. ఒక స్థాయికి వచ్చాక మాకు ట్యాలెంట్ నిరూపించుకునేలా మంచి పాత్రల్ని ఇవ్వాలి. దర్శకనిర్మాతలను ఇదే అడుగుతాను. మంచి విలన్ పాత్రలు ఇవ్వ ండి. చేయను అని అనను. దర్శకరచయితలకు ఇదే చెబుతున్నా. సుమన్ చేయడు అని చెప్పను. విలన్ కి ఎంత పవర్ ఇస్తారు అన్నది ముఖ్య ం.
ఈ జనరేషన్ దర్శకులు విలనీని అంత బాగా చూపించలేదని అసంతృప్తి ఉందా?
*రాజమౌళిని చూడండి. ఆయన ఈ జనరేషన్ డైరెక్టర్. విలన్‌కి ఎంతటి పవర్ ని ఇస్తున్నారో. నేటి జనరేషన్ లో రాజమౌళి మాత్రం విలన్ ని ఎంతో గొప్పగా చూపిస్తున్నారు. పరిశ్రమ ఏదైనా విలనీ ఉన్న సినిమాలే గెలుస్తున్నాయి. తమిళం, మలయాళం సహా అన్ని పరిశ్రమల్లో ఇది ఉంది. బాహుబలి లో ప్రభాస్ కాదు రానా హీరో. చివరిలో రానా ఫైర్ లో పడిపోతాడు కానీ, ప్రభాస్ ఎక్కడా తనని తోసేయడు. తనే బ్యాలెన్స్ తప్పి పడిపోతాడు. చచ్చే వరకూ అతడు పవర్ ఫుల్. ప్రభాస్ ఎక్కడా టచ్ చేయడు. అంటే విలన్ చచ్చే వరకూ ఫవర్ ఫుల్ అని చూపించారు. అది రాజమౌళి వల్లనే సాధ్య ం . విలన్ ని అల చూపాలంటే గట్స్ కావాలి. హీరోలు పది మంది 20 మందిని కొట్టేయడం, క్లైమాక్స్ లో 40 మందిని కొట్టేయడం ఇదేమీ గొప్ప కాదు. ఇక శివాజీ సినిమాలో విలన్ ఎంత పవర్ ఫుల్ గా కనిపించారో చూశాం. శంకర్ అంత గొప్పగా చేశారు. రాజమౌళి ఇప్పటికే నిరూపించారు. గొప్ప విలన్ ని చూపించారు. ఒక సినిమా కాదు ఎన్నో సినిమాలతో దీనిని నిరూపించారు. ఈగ సినిమాలో సైతం డిఫరెంట్ విలనిజం క్రియేట్ చేశారు. ఆ విలన్ ఈగతో ఫైట్ చేయడం అన్నది క్రియేట్ చేశారు. విలన్ కి కథలో ఎవరు ప్రాముఖ్యత నిస్తారో ఆ సినిమానే హిట్టవుతుంది. రాగానే 20 మందిని కొట్టేయడం గాల్లో ఎగిరేయడం ఇవన్నీ చూపిస్తున్నారు. ఇంటెలెక్చువల్ గా ఎలా కొట్టాలి? అన్నది రాజమౌళి చూపించారు. విలన్ గా అలాంటి పవర్ ఫుల్ పాత్రలు ఇస్తే నేను చేస్తాను. రొటీన్ గా రేప్ లు చేయడం, బ్యాంక్ దోచేయడం వంటి విలనీని రాజమౌళి చూపించరు. పాత డబ్బా నుంచి బయటికి వచ్చి కొత్తగా చేయాలి.
నిర్మాతే సహకారం, నిర్మాణ విలువలు ఎలా ఉన్నాయి?
* కథ ఇదీ అని దర్శకనిర్మాతలు చెప్పారు. చెప్పిన ప్రకారం తీశారు. అవసరం మేర కాస్టింగ్ తో సినిమాని చేశారు. కొత్త దర్శకుడిని నమ్మి నిర్మాత అవకాశం ఇచ్చారు. మంచి కథలతో ఇలాంటి నిర్మాతలు మరింతమంది రావాలి. డబ్బు ఒక్కటే కాదు. సినీపరిశ్రమ ఒక గ్యాంబుల్ లాంటిది. క్రికెట్ బెట్టింగ్ తరహానే. అయితే కంటెంట్ తో కొట్టాలి. ఇతర భాషల్ని పరిశీలిస్తే అది అర్థమవుతుంది. హిందీ పరిశ్రమ గొప్పగా ఉంటుంది. కథ బావుంటే కొత్త కుర్రాళ్లు అయినా చూస్తారు. ఆర్.ఎక్స్ 100, అర్జున్ రెడ్డి వంటి చిత్రాల విజయాలు సాధించాయి.
సినిమా తొలి కాపీ చూశారా?
*ఈ సినిమా రఫ్ కాపీ చూశాను. ఆర్టిస్టుగా మేం ఏం చేసినా దానికి సంతృప్తి ఉండదు. దీనికంటే బెటర్ చేయాలి అని వన్ మోర్ అని అడుగుతాం. మమ్మల్ని సంతృప్తి పరచడం కష్టం. అయితే దర్శకనిర్మాతలు ఏం అనుకున్నారో అద్భుతంగా చూపించారు. నా పాత్ర, బాలాజీ, బాబు మోహన్ రోల్స్ బాగా వచ్చాయి. హీరో అర్జున్ నటన ఆకట్టుకుంటుంది. కళాకారుడిగా బాగానటించారని చెప్పడం నా బాధ్యత. ఈ సినిమా రిలీజయ్యాక అందరికీ పేరొస్తుంది.
Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.
He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.
When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.
He can be reached at gopi@socialnews.xyz
This website uses cookies.