వరుణ్ తేజ్ వాల్మీకి టైటిల్ వివాదం !
వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఇటీవల ప్రారంభం అయిన సినిమా వాల్మీకి. తమిళ్ లో సక్సెస్ సాధించిన జీగార్తాండ సినిమాకు రీమేక్ ఇది. దీవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్న ఈ సినిమాను 14 రీల్స్ సంస్థ నిర్మిస్తోంది.
ఈ చిత్ర పోస్టర్ ఇప్పుడు వివాదంగా మారింది. విషయం ఏంటంటే... వాల్మీకి టైటిల్ లో పైన గన్ సింబల్ అటాచ్ అయ్యింది. ఇది చూసిన వాల్మీకి కులస్థులు మండిపడుతున్నారు. తన కులం పేరుకు గన్ యాడ్ చెయ్యడం ఏంటని అంటున్నారు.
మరి ఈ విషయం గురించి చిత్ర యూనిట్ ఇదివరుకు స్పందించలేదు. ఈ వివాదం మరెంతదూరం వెళుతుందో చూడాలి. డిఫరెంట్ కాన్సెప్ట్స్ ను సెలెక్ట్ చేసుకొని సినిమాలు చేస్తున్న వరుణ్ తేజ్ కు ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుందని ఆశిద్దాం. వచ్చే నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
This website uses cookies.