మహేశ్ బాబు సినిమాపై క్లారిటీ వచ్చింది!
మహేశ్ బాబు 25వ సినిమా మహర్షి ఏప్రిల్ 4న విడుదల కానుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల సినిమా విడుదల వాయిదా పడినట్లు న్యూస్ వచ్చింది. కానీ స్పస్టమైన విడుదల తేదీ ఎప్పుడు అనేది అభిమానులకు తెలియదు, చివరికి ఈ విషయంపై క్లారిటీ వచ్చింది.
తాజాగా దిల్ రాజు తిరుపతిలో శ్రీవారిని దర్శనం చేసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఏప్రిల్ 25న మహర్షి విడుదల కానుందని వెల్లడించాడు. చిత్ర షూటింగ్ కొంత ఆలస్యం కారంగానే విడుదల వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి.
దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రైతుల గురించి కొంత భాగం ఉంటుందని సమాచారం. అల్లరి నరేశ్, రాజీవ్ కనకాల ఈ చిత్రంలో మహేశ్ బాబు ఫ్రెండ్స్ గా నటించారు.
This website uses cookies.