Allu Arjun’s next with Trivikram to have an emotional story

రూటు మార్చిన అల్లు అర్జున్ !

అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చెయ్యబోతున్నాడు. మార్చి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. తమన్ సంగీతన్ అందించబోతున్న ఈ సినిమాను హారికా హాసిని, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించబోతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో బన్నీ పక్కన కైరా అద్వానీ, రస్మిక మందన్నా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి కానీ, ఎవ్వరూ ఓకేకాలేదని తెలుస్తోంది. త్వరలో హీరోయిన్ పేరు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమా గురించి ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది.

బన్నీ ఈ సినిమా కోసం ఎమోషనల్ సబ్జెక్టు ను రెడీ చేయించుకున్నట్లు సమాచారం. కామిడీ, ఫ్యామిలీ , లవ్ కాకుండా ఎమోషనల్ మీద వెలుతున్నట్లు సమాచారం. హిట్ కొట్టాలన్న కసితో ఉన్న బన్నీ కొత్త తరహా కథ, కథాంశం తో ప్రేక్షకుల ముందుకు రావాలనుకుంటున్నాడు అల్లు అర్జున్.

Facebook Comments
Share
More

This website uses cookies.