Producers running away from Ravi Teja

రవితేజ అంటే నిర్మాతలు వెనకడుగు !.

వరుస ఫ్లాప్ సినిమాలతో వెనకాపడ్డ రవితేజ ప్రస్తుతం ఏ సినిమా చెయ్యడం లేదు. ఒప్పుకున్న వి.ఐ.ఆనంద్ సినిమా కూడా బాగా ఆలస్యం అవుతూ ఉంది. రవితేజ అడిగిన 10 కోట్లు ఇవ్వలేక ఈ చిత్ర నిర్మాత సినిమా చెయ్యడానికి ఆసక్తి చూపించడం లేదు. ఎప్పుడో స్టార్ట్ కావల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది.

డిసెంబర్ లో ఈ చిత్రాన్ని స్టార్ట్ చేసి ఈ ఏడాది వేసవికి విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. కానీ రవితేజ చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్స్ అవ్వడంతో ఈ సినిమాను హోల్డ్ లో పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ఉంటుందా ? లేదా ? అనేది కూడా క్లారీటి లేదు.

రవితేజ అంటే మినిమమ్ గ్యారెంటీ హీరో అనే పేరు ఉండేది. కానీ ఇప్పుడు రవితేజ సినిమా అంటే భయపడుతున్నారు నిర్మాతలు. రవితేజ, వి.ఐ.ఆనంద్ సినిమా ఉంటుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఈ సమయంలో రవితేజ తక్కువ బడ్జెట్ లో మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడమే బెస్ట్.

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%