వినయ విధేయ రామ ఎక్కడ దెబ్బ పడింది ?.
వినయ విధేయ రామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ చరణ్ ఈసారి నెగిటివ్ టాక్ తెచ్చుకున్నాడు. సినిమా చూసిన ఆడియన్స్ పూర్తిగా బ్యాడ్ గా చెబుతున్నారు. అభిమానులు కూడా ఈ సినిమా గురించి ఎక్కడా పాజిటివ్ గా చెప్పక పోవడం గమనార్ధం.
బోయపాటి శ్రీను సినిమాలు మాస్ ప్రేక్షకులను బాగా మెప్పిస్తాయి. సైరైనోడు, సింహా, లెజెండ్ సినిమాకు అందుకు ఉదాహరణలు. వినయ విధేయ రామ సినిమా చూస్తుంటే... బోయపాటి శ్రీను అదుపు తప్పినట్లు కనిపిస్తోంది. సినిమాలో సీన్స్, కథ, పాటలు ఏవీ గొప్పగా లేనందున మొదటి ఆటనుండే ఫ్లాప్ టాక్ వచ్చింది.
చరణ్ కెరీర్ లో ఇంత పెద్ద ఫ్లాప్ సినిమా రాలేదనే చెప్పాలి. భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యకపోగా నవ్విస్తాయి. బోయాపాటి అన్నీ సినిమాల్లో లాగే ఈ సినిమాలో రాజకీయ నాయకుడు వాడి తమ్ముడు పొలిటీషియన్ హీరోతో తగువు పెట్టుకోవడం, హీరో కుటుంభంజోలికి రావడం హీరో వాడిపై రివెంజ్ తీర్చుకోవడం. కొత్త కథలు రాస్తే తప్పా బోయపాటిని ప్రేక్షకులు ఆధరించరు.
This website uses cookies.