ఆర్.ఆర్.ఆర్: అవును అది నిజమే!
రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ పునర్జన్మల నేపద్యంలో ఉంటుందని సోషల్ న్యూస్ మొదటనే చెప్పింది. ఈరోజు కీరవాణి ఎన్‌టిఆర్ బయోపిక్ సినిమాకు సంభందించి ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ. ఆర్.ఆర్.ఆర్ సినిమా కోసం రెండు విభిన్నమైన కాలాలకు సంభందించి డిఫరెంట్ మ్యూజిక్ ఇవ్వబోతున్నట్లు తెలిపాడు.
కీరవాణి మాటల్ని చూస్తుంటే ఈ సినిమా పునర్జన్మల నేపద్యంలో ఉంటుదని రుజువు అయ్యింది. 1940 లో కొంత భాగం ఇప్పుడు 2018లో కొంత భాగం సినిమా ఉంటుందని సమాచారం. కథ, నేపద్యాన్ని పక్కన పెడితే రాజమౌళి ఎమోషన్స్ తో సినిమాను నడిపిస్తాడు.
ఈ నెల 19 నుండి సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానున్న ఈ సినిమాకు బుర్రా సాయి మాధవ్ మాటలు రాస్తుండగా సెందిల్ కెమెరా మెన్ గా పని చేస్తున్నాడు. 2020 వేసవిలో ఏ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. చరణ్, ఎన్‌టిఆర్ ను రాజమౌళి తనదైన స్టయిల్ లో చూపించబోతున్నాడు.
This website uses cookies.