మరో కాపీ కథతో త్రివిక్రమ్ !
త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా అల్లు అర్జున్ తో చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్, హారికా హాసినీ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నాయి. ఈ నెలలో ప్రారంభం అయ్యే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి నుండి మొదలుకానుంది.
తాజా సమాచారం మేరకు త్రివిక్రమ్ ఈ సినిమాను హాలివుడ్ లో విజయం సాధించిన ది ఇన్వెన్సన్ ఆఫ్ లయింగ్ సినిమా కథను ఆధారంగా చేసుకొని మూవీ కథ రాసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ గతంలో పవన్ కల్యాణ్ తో తీసిన అజ్ఞాతవాసి సినిమా కూడా హాలివుడ్ లార్గోవించ్ ను ఆధారంగా తీసుకొని చేసినదే.
అల్లు అర్జున్ పక్కన కైరా అద్వానీ హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఎలాగైనా సరే ఈసారి సక్సెస్ సాధించాలని బన్నీ కసితో ఉన్నాడు. త్రివిక్రమ్ బన్నీకి హిట్ ఇస్తాడా లేదా చూడాలి. త్రివిక్రమ్ సినిమాలు విడుదల అయ్యే వరుకు చెప్పలేము.