Naga Shaurya not part of Varun Tej’s project

మెగా హీరో సినిమాలో ఆ యువ హీరో లేడు !.

హరీష్ శంకర్ దర్శక్త్వంలో వరుణ్ తేజ్ నటించబోతున్న సంగతి తెలిసిందే. తమిళ్ జిగర్ తాండ సినిమాకు రీమేక్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ పక్కన నాగ శౌర్య నటించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. కానీ వాస్తవానికి ఆ న్యూస్ లో నిజం లేదని సమాచారం.

ఇంతవరుకు ఈ సినిమా కోసం ఏ హీరోను సంప్రదించలేదని టాక్ వినిపిస్తోంది. కథ ఇంకా పూర్తిగా అవ్వలేదని, స్టోరీ అయ్యాకే నటీనటుల గురించి ఆలోచిస్తామని చిత్ర వర్గాల నుండి వార్తా నినిపిస్తోంది. 14 రీల్స్ సంస్థ నిర్మించబోతున్న ఈ సినిమా షూటింగ్ మార్చి నుండి ఉండొచ్చు.

వరుణ్ తేజ్ నటించిన అంతరిక్షం సినిమా విడుదలై పెద్దగా సక్సెస్ కాలేదు. కావున కాస్త టైమ్ తీసుకొని సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఇటీవల ఈ హీరో కిరణ్ అనే నూతన దర్శకుడితో సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి.

Facebook Comments
Share

This website uses cookies.