Saaho new posters will release on the New Year!

సాహో కొత్త పోస్టర్స్ రెడీ !

ప్రభాస్ నటిస్తోన్న సాహో సినిమా ఆగష్టు 15 న విడుదల కానుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. సాహో చాప్టర్ 1 పేరుతో ఈ సినిమా మేకింగ్ వీడియోను విడుదల చేశారు, వీడియోలో విజువల్స్ గ్రాండ్ గా ఉండడంతో పాటు సినిమాలో మంచి కంటెంట్ ఉందని టాక్ వినిపిస్తోంది.

తాజా సమాచారం మేరకు ఈ సినిమా కొత్త పోస్టర్స్ ను జనవరి 1న విడుదల చెయ్యనున్నారు చిత్ర యూనిట్. సినిమాలోని కొన్ని వర్కింగ్ స్టిల్స్ తో పాటు టీజర్ప్లాన్ చేస్తున్నారనే న్యూస్ వినిపిస్తోంది. సినిమాకు సంభందించి ఏదో ఒకటి బయటికి వస్తుంటే బాగుంటుంది. ప్రమోషన్స్ తో పాటు సినిమాపై అంచనాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.

ప్రభాస్ ఈ సినిమాతో పాటు రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక లవ్ స్టోరీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల ఇటలీలో జరిగింది. సాహో సినిమాకు సంగీతం అందిస్తున్న అమిత్ త్రివేది ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండడం విశేషం.

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%