Social News XYZ     

Rajinikanth’s Petta to release for Sankranti after Baasha

రజినీకాంత్ బాషా తరువాత మళ్ళీ సంక్రాంతి కానుక గా వస్తున్న"పేట"

Rajinikanth's Petta to release for Sankranti after Baasha

సర్కార్, నవాబ్ వంటి హిట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన అభిరుచిగల నిర్మాత వల్లభనేని అశోక్ హ్యాట్రిక్ దిశగా  సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన "పెట్టా" చిత్రాన్ని "పేట" పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న విషయం విదితమే.

 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వల్లభనేని అశోక్ మాట్లాడుతూ  "సూపర్ స్టార్ రజినీకాంత్ రొరింగ్ పెర్ఫార్మెన్స్ హైలెట్ గా తెరకెక్కిన "పేట" అనే విజువల్ ఫీస్టును తెలుగు ప్రేక్షకులకు అందిస్తునందుకు సంతోషంగా ఉంది.చిత్రదర్శకుడు కార్తీక్ సుబ్భారాజ్ రజినీకాంత్ కు వీరాభిమాని. ఆయన గతం లో పిజ్జా,జిగర్తాండ చిత్రాలతో సూపర్ హిట్ దర్శకుడి గా పేరున్న ఆయన రజినీకాంత్ ను తెరకెక్కించిన విధానం తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది.అలాగే సంగీత దర్శకుడు అనిరుద్ ఈ చిత్రానికి ఎక్స్ట్రార్డినరీ సంగీతాన్ని అందించారు.అలాగే ఈ చిత్రం లో ప్రతి ఒక్కరిపాత్రలు  ఆకట్టుకుంటాయి.అటు మాస్ ఆడియెన్స్ ను ,ఇటు క్లాస్ ఆడియెన్స్ ను కట్టిపడేసే కమర్షియల్ అంశాలున్నమంచి చిత్రమిది.అలాగే ఫస్ట్ టైం కనడ లో డబ్ అయ్యి రిలీజ్ కాబోతున్నసినిమా ఇది .అలాగే డార్జీలింగ్ వంటి హిల్  స్టేషన్లతో పాటు ఫారెన్ లొకేషన్లలో ఈ చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దటం జరిగింది.అలాగే రజినీకాంత్ హిట్ మూవీ "బాషా" తరువాత మళ్ళీ సంక్రాంతి కి "పేట" రూపంలో థియేటర్లలో సందడి చేయటానికి రజినీకాంత్ గారు రావటం సంతోషంగా ఉంది జనవరి మొదటి వారంలో ప్రీరిలీజ్ ఈవెంట్ చేసి సంక్రాంతి కానుకగా రెండో వారంలో రిలీజ్ చేయనున్నాం" అన్నారు.

త్రిష,సిమ్రాన్,విజయ్ సేతుపతి,బాబీ సింహ,నవాజుద్దీన్ సిద్ధికి మాళవిక నాయర్,మేఘ ఆకాష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరుద్,కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం: కార్తీక్ సుబ్భారాజ్,నిర్మాత: వల్లభనేని అశోక్.

Facebook Comments
Rajinikanth's Petta to release for Sankranti after Baasha

About uma