Ranarangam movie to release in January 1st week

జనవరి మొదటి వారంలో "రణరంగం" విడుదల

ARC ఎంటర్టైన్మెంట్ పతాకం పై ఇళయరాజా సంగీత సారధ్యంలో శరణ్ .కె.అద్వైతన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం "రణరంగం".ఈ చిత్రాన్ని ఎ.ఆర్.శీనురాజ్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి మొదటి వారంలో విడుదల కానుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎ.ఆర్.శీనురాజ్ మాట్లాడుతూ "ఇదొక అన్ని కమర్షియల్ హంగులున్న యాక్షన్ చిత్రం.అల్లు అర్జున్ "హ్యాపీ" చిత్రంలో నటించిన కిషోర్ ఈ చిత్రంలో కథానాయకుడుగా నటించాడు.ఇళయరాజా గారి సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ.అన్ని హంగులతో ఈ చిత్రాన్ని జనవరి మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకరానున్నాం" అన్నారు.

కిషోర్,యజ్ఞాశెట్టి నటించిన ఈ చిత్రానికి సంగీతం:ఇళయరాజా, మాటలు:మల్లూరివెంకట్, ఎడిటర్:సురేష్, కెమెరా:జెమిన్, పాటలు:వెన్నిలకంటి, నిర్మాత:ఎ.ఆర్.శీనురాజ్, దర్శకత్వం: శరణ్ .కె.అద్వైతన్.

Facebook Comments

About uma

Share

This website uses cookies.

%%footer%%