Maari 2 movie theaters will be increased: Icon Movies Sriram

ధ‌నుష్ `మారి 2` థియేట‌ర్లు పెంచుతున్నాం- ఐక‌న్ మూవీస్ శ్రీ‌రామ్‌

ర‌ఘువ‌ర‌న్ బిటెక్ చిత్రంతో బంప‌ర్ హిట్ కొట్టిన ధ‌నుష్, ఫిదా బ్యూటీ సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన మారి 2 ఇటీవ‌లే తెలుగు రాష్ట్రాల్లో రిలీజైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌తాప్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ధ‌నుష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని ఐక‌న్ మూవీస్ అధినేత శ్రీ‌రామ్ నైజాం, సీడెడ్, ఆంధ్రాలో రిలీజ్ చేశారు. సినిమా విజ‌య‌వంతంగా ర‌న్ అవుతున్న సంద‌ర్భంగా నిర్మాత  ధ‌నుష్  ఆనందం వ్య‌క్తం చేశారు. ఈనెల 28 నుంచి థియేట‌ర్ల‌ను పెంచుతున్నామ‌ని తెలిపారు.

ఐక‌న్ మూవీస్ అధినేత శ్రీ‌రామ్ మాట్లాడుతూ-మారి 2` త‌మిళం, తెలుగులో సైమ‌ల్టేనియ‌స్‌గా రిలీజైంది. ఈ చిత్రం ఏ ఒక్క వ‌ర్గానికో కాకుండా అన్ని వ‌ర్గాల‌కు న‌చ్చింది. ఏ, బీ, సీ కేంద్రాల నుంచి స్పంద‌న బావుంది. ముఖ్యంగా ద్వితీయార్థంలో ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్ అందరికీ న‌చ్చాయి. కొన్ని స‌న్నివేశాల్లో క‌న్నీళ్లు పెట్టించేంత‌టి అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేసింది. ధ‌నుష్ న‌ట‌న పెద్ద ప్ల‌స్ అయ్యింది. వాసుకి లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించాం. ఆ వెంట‌నే మ‌రో విజ‌యం అందుకోవ‌డం ఆనందాన్నిచ్చింది. వ‌చ్చే వారం నుంచి మ‌రిన్ని థియేట‌ర్లు పెంచుతున్నాం. ఈ క్రిస్మ‌స్ బ‌రిలో నాలుగు సినిమాల‌తో పోటీప‌డి రిలీజైన మా చిత్రం సంతృప్తిక‌రమైన ఫ‌లితాన్ని ఇచ్చింది అన్నారు.

Facebook Comments

About uma

Share

This website uses cookies.

%%footer%%