'మంచు కురిసే వేళలో` సెన్సార్ క్లీన్ యు, 28న రిలీజ్
రామ్ కార్తీక్, ప్రనాలి జంటగా బాల బోడెపూడి స్వీయ దర్శకత్వంలో ప్రణతి ప్రొడక్షన్ నిర్మించిన చిత్రం మంచు కురిసే వేళలో
. ఇటీవలే రిలీజైన మోషన్ పోస్టర్, టీజర్ కి అద్భుత స్పందన వచ్చింది. పాటలకు చక్కని స్పందన వస్తోంది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బృందం క్లీన్ యు
సర్టిఫికెట్ ఇచ్చి అభినందించింది. ఈనెల 28న సినిమా థియేటర్లలోa రిలీజవుతోంది.
ఈ సందర్భంగా దర్శక నిర్మాత బాల మాట్లాడుతూ..మంచు కురిసే వేళలో అందమైన లొకెషన్స్ లొ అంతే అందమైన కథ కథనాలతొ తీసిన స్వచ్చమైన ప్రేమకథా చిత్రం. సంగీతం, సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. రామ్ కార్తీక్ కెరీర్‌లో ఇదొక ఉత్తమ చిత్రమవుతుంది. కథానాయిక నటన, అందచందాలు ఆకట్టుకుంటాయి. అన్ని పనులు పూర్తయ్యాయి. ఇటీవలే రిలీజైన ఆడియోకి శ్రోతల నుంచి స్పందన బావుంది. తాజాగా సెన్సార్ క్లీన్ యు ఇచ్చి అభినందించడం కాన్ఫిడెన్స్‌ను పెంచింది. ఈ సీజన్‌లో బెస్ట్ ఎంటర్‌టైనర్‌ని అందిస్తున్నాం. కుటుంబ సమేతంగా అందరినీ ఆకట్టుకునే చిత్రమిది. పెద్ద విజయం అందుకుంటామన్న ధీమా ఉంది
అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: శ్రావణ్ భరద్వాజ్, కెమెరా: తిరుజ్ఞాన, ప్రవీణ్ కుమార్ పంగులూరి, పి.ఆర్.ఓ : సాయి సతీష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, కధ- స్క్రీన్ ప్లే- నిర్మాత- దర్శకత్వం: బాల బోడెపూడి.
This website uses cookies.