ఆర్.ఆర్.ఆర్ లో చరణ్ బాబాయి ఎవరో తెలుసా ?
.
రాజమౌళి భారీ మల్టీ స్టారర్ సినిమా ఆర్.ఆర్.ఆర్ మొదటి షెడ్యూల్ పూర్తి అయ్యింది. జనవరి 19 నుండి సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో నటించే హీరోయిన్స్ ఎవరనేది క్లారిటీ లేదు. మూడో షెడ్యూల్ లో హీరోయిన్స్ జాయిన్ కాబోతున్నారు, ఆ సమయంలో ఎవరనేది తెలిసే అవకాశం ఉంది.
తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో చరణ్ బాబాయి పాత్రలో తమిళ్ దర్శకుడు సముద్రఖని నటించబోతున్నట్లు సమాచారం. దర్శకుడిగా రవితేజ నటించిన శంభో శంకర సినిమాతో ఆయన పరిచయం, అలాగే ధనుష్ నటించిన రఘువరన్ బి.టెక్ సినిమాలో ధనుష్ ఫాదర్ పాత్రలో సముద్రఖని నటించారు.
చరణ్ కు బాబాయి పాత్రలో సముద్రఖని అయితే బాగుంటుందని చిత్ర దర్శకుడు రాజమౌళి భావించడంతో అతన్ని తీసుకున్నట్లు సమాచారం. జనవరి నుండి స్టార్ట్ అయ్యే షెడ్యూల్ లో సముద్రఖని పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నటించే ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.