హార్రర్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న" రహస్యం"
భీమవరం టాకీస్ పతాకంపై శైలేష్ , శ్రీ రితిక జంటగా సాగర్ శైలేష్ దర్శకత్వంలొ తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తొన్న చిత్రం రహస్యం. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రసాద్ ల్యాబ్స్ లొ జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ సిఎం , మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య, సి.కల్యాణ్, శివశక్తి దత్తా, రాజ్ కందుకూరి, యంగ్ హీరొ మానస్, శివ శంకర్ మాస్టర్, విచ్చేసారు.
రోశయ్య మాట్లాడుతూ.. నిర్మాత రామసత్యనారాయణ వంద చిత్రాలకు చెరువయ్యారు. తను నాకు ఆత్మీయుడు. మంచి సినిమాను తీయటంతో పాటు దాన్ని వైవిధ్యంగా ప్రమోట్ చెస్తారు. ఈ చిత్ర ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. టీమ్ అందరికీ మంచి పేరు తీసుకువస్తొంది. చిన్న చిత్రాల ద్వారా కూడా డబ్బు ఎలా సంపాదించాలన్నది రామ సత్యనారాయణ గారిని చూసి నేర్చికొవాలన్నారు.
సి.కల్యాణ్ మాట్లాడుతూ.. రామసత్యనారాయణ సినిమాను ప్రేమించె వ్యక్తి. వంద చిత్రాలను తీసిన తెలుగు నిర్మాతగా రామానాయుడు గారు, రామ సత్యనారాయణ నిలిచి పొతారు. తన సినిమా ఫంక్షన్ అంటే అది నా సినిమా ఫంక్షన్ లానే ఉంటుంది. రహస్యం తో తాను లాభాలను సాందిచాలని ఆసిస్తున్నానన్నారు.
రామసత్యనారాయణ మాట్లాడుతూ..కంటెంట్ బాగుంటేనె ఈ రోజు ఎంతటి స్టార్ హీరొ సినిమా అయినా ఆడుతోంది. లెదంటే ప్రేక్షకులు ఎలాంటి మోహమాటం లేకుండా తిరస్కరిస్తున్నారు. రహస్యం కంటెంట్ ఉన్న చిత్రం. ఈ సినిమాను ముందు నుంచి ప్రమోట్ చెస్తొన్న వివి.వినాయక్, పూరీ జగన్నాథ్,రామ్ గోపాల్ వర్మ, రాజ్ కందుకూరి, శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు. రోశయ్య గారి ఆశీస్సులు ఎప్పుడు నాకు ఇలానే ఉండాలి. ఈ సినిమాను విడుదలకు రెండు రోజుల ముందే ప్రెస్ షో వేసి చూపిస్తానన్నారు.
హీరొ శైలేష్ మాట్లాడుతూ.. కంటెంటే ప్రధాన బలంగా , రామ సత్యనారాయణ గారి సపోర్ట్ తో "రహస్యం" హార్రర్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందించబడింది. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నానన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: కబీర్ రఫీ, కెమెరా: సుధాకర్.
This website uses cookies.