ఎలెక్షన్స్ ఉన్నా
కలెక్షన్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి... హీరో సుమంత్
‘‘సుధాకర్ ఇంపెక్స్ ఐపిఎల్’’ పతాకం పై బీరం సుధాకర రెడ్డి నిర్మించిన ‘‘సుబ్రహ్మణ్యపురం’’. సెన్సిబుల్ హీరో సుమంత్ , ఈషారెబ్బ జంటగా నటించిన ఈమూవీ తో సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. నిన్న (శుక్రవారం) గ్రాండ్ రిలీజ్ అయిన ఈ మూవీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. థ్రిల్లర్ జానర్ సినిమా లలో "సుబ్రహ్మణ్యపురం" ప్రత్యేకంగా నిలుస్తుంది. శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ కి ప్రత్యేక ప్రశంసలు దక్కుతున్నాయి. కొత్త దర్శకుడు అయినా సంతోష్ కథను చాలా గ్రిప్పింగ్ గా నడిపాడు. సీన్ బై సీన్ ఉత్కంఠత పెంచే కథనం సుబ్రహ్మణ్యపురం ను హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో పరుగులు పెట్టిస్తుంది. బాల సుబ్రహ్మణ్యం పాడిన 'సహో షణ్ముఖ ' సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. విజువల్ ఎఫెక్ట్స్ హైలెట్ గా నిలిచాయి.
అల్ రౌండ్ సక్సెస్ టాక్ ని సొంత చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో సుమంత్, దర్శకుడు సంతోష్ జగర్లపూడి, నిర్మాత బీరం సుధాకర రెడ్డి పాల్గొన్నారు.
హీరో సుమంత్ మాట్లాడుతూ : "నిన్న ఎలక్షన్స్ ఉన్నా సినిమా మంచి కలెక్షన్స్ సాధించింది. సినిమా రిలీజ్ అయిన దగ్గర నుండి చాలా మంచి రిపోర్ట్స్ విన్నాను. మార్నింగ్ డిస్ట్రిబ్యూటర్స్ తో మాట్లాడాను చాలా మంచి టాక్ చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. సంతోష్ లాగా ఎవరైనా మంచి స్క్రిప్ట్ తో వస్తే ఏ జానర్ లో అయినా సినిమా చేయడానికి రెడీ గా ఉన్నాను. " అన్నారు
దర్శకుడు సంతోష్ జగర్లపూడి మాట్లాడుతూ : " ముఖ్యంగా కథను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాత బీరం సుధాకర రెడ్డి గారికి, సుమంత్ గారి కి థాంక్స్. నిన్న యూ ఎస్ నుండి నా ఫ్రెండ్స్ కాల్ చేసి అభినందనలు తెలిపారు. నిన్న డిస్ట్రిబ్యూటర్స్ కూడా మాట్లాడారు చాలా స్ట్రాంగ్ రిపోర్ట్ చెప్పారు. ముఖ్యంగా నిర్మాత చాలా సంతోషంగా ఉన్నారు. సెకండ్ ఆఫ్ గురించి కథనం పై చాలా మంచి ప్రశంసలు వస్తున్నాయి. మీడియా చాలా బాగా సపోర్ట్ చేసింది. చాలా థాంక్స్" అన్నారు.
నిర్మాత బీరం సుధాకర రెడ్డి మాట్లాడుతూ : "మార్నింగ్ షోస్ నుండే హౌస్ ఫుల్ కలెక్షన్లు సాధించింది సుబ్రహ్మణ్యపురం. ఈ విషయం లో చాలా సంతోషంగా ఉన్నాను. అనుకున్న విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మా చిత్రానికి సహకరించిన హీరో సుమంత్ గారికి, ఇతర సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు" అన్నారు.
హీరో: సమంత్,
హీరోయిన్ః ఈషారెబ్బ
ప్రధాన తారాగణంః సురేష్, సాయికుమార్, ఆలి, సత్య సాయి శ్రీనివాస్,
మిర్చి మాధవి, సుర్య, రఘునాథ్ రెడ్డి, సారిక రామచంద్రరావు, జోష్
రవి, బద్రం, గిరిధర్, అమిత్ శర్మ, టి.ఎన్.ఆర్.
సాంకేతిక వర్గంః
సినిమాటోగ్రఫిః ఆర్.కె. ప్రతాప్
ఎడిటర్ః కార్తిక్ శ్రీనివాస్
సంగీతంః శేఖర్ చంద్ర
క్యాస్టూమ్ డిజైనర్ః సుమ త్రిపురణ
ఫైట్స్ః డ్రాగన్ ప్రకాష్
పి.ఆర్.ఓః జియస్ కె మీడియా
కో డైరెక్టర్ః ఆర్.సురేష్
ప్రొడ్యూసర్ ః బీరమ్ సుధాకర రెడ్డి
రైటర్ అండ్ డైరెక్టర్ః సంతోష్ జాగర్లపూడి
This website uses cookies.