బెల్లంకొండ సినిమాకు టైటిల్ ఖరారు!
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ మసాలా ఎంటర్టెనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా మన్నారా చోప్రా ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతోంది. అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సినిమాకు సీత అనే ఫిమేల్ టైటిల్ లాక్ చేశారని సమాచారం. కాజల్ ఈ సినిమాలో సీత పాత్రలో కనిపించబోతోంది. హీరోయిన్ కు అధిక ప్రాధాన్యం ఉన్న ఈ సినిమా ఇంగ్లిష్ లో వచ్చిన రైన్ మ్యాన్ సినిమాను కాపీ అని వార్తలు వస్తున్నాయి.
బెలంకొండ శ్రీనివాస్ గత సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. కావున ఇప్పుడు అతని హోప్స్ అన్నీ తేజ సినిమాపైనే ఉన్నాయి. ఈ మూవీ అయిన తనకు విజయాన్ని తెచ్చిపెడుతుందో లేదో చూడాలి. మంచి కథ బలం ఉన్న సినిమాలు ఈ బెల్లం బాబు ఎప్పుడు చేస్తాడో ?
This website uses cookies.